Banks Merger: బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంస్కరణలపై ఫోకస్ పెట్టింది. పలు బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రెండు దఫాలుగా ముందుకు సాగింది. అయితే ఇదే రంగంలో త్వరలో మరో బిగ్ అప్‌డేట్ వస్తుందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 4 చిన్న బ్యాంకుల విలీనానికి పనులు చకచకా జరిగిపోతున్నట్లు సమాచారం. ఇందుకోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ చట్టంలో మార్పులు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

పలు నివేదికల ప్రకారం.. విలీనం కోసం ప్రభుత్వం ముందు రెండు ప్లాన్స్ ఉన్నట్లు సమాచారం. మొదటగా UCO బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ & సింధ్ బ్యాంక్ మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను విలీనం చేయాలని చూస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ లేదా ఇండియన్ బ్యాంక్‌తో వీటిని విలీనం చేయడం అనేది రెండవ ప్లాన్‌గా సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గత రెండుమూడేళ్లుగా పరిశీలిస్తే సదరు 4 బ్యాంకుల పనితీరు గణనీయంగా మెరుగుపడింది. పంజాబ్ & సింద్ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 98.25 శాతం వాటా ఉండగా.. సెంట్రల్ బ్యాంక్‌లో 93.08 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 86.46 శాతం, యూకో బ్యాంక్‌లో 95.39 శాతం వాటా ఉన్నాయి. 2019లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 సంస్థలుగా విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే పలు చర్యలు చేపడుతోంది.


Click it and Unblock the Notifications