GeM: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్ దిగ్గజ కంపెనీలతో పోలిస్తే గవర్నమెంట్ ఇ-మార్కెట్(GeM) ప్లేస్ ద్వారా పలు ఉత్పత్తులు సరసమైన ధరలకే లభిస్తాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల(PSU) ఉద్యోగులకు మాత్రమే ఈ పోర్టల్ లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సేవలను మరింత మెరుగుపరచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మార్కెట్ ప్లేస్ ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు తమతో భాగస్వామ్యం కుదిరినట్లు TCS ప్రకటించింది. సమయానుగుణంగా కొత్త సాంకేతికతో ప్లాట్ ఫారమ్ ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని పేర్కొంది.

ఇప్పుడున్న GeMని ఇ-కామర్స్, ఇ-మార్కెట్ ప్లేస్ నియమాల సమ్మేళనంగా మార్చనున్నట్లు TCS తెలిపింది. వివిధ భాషల్లో సేవలు అందించనున్నట్లు వెల్లడించింది. ఓపెన్ సోర్స్, ఓపెన్ AI కాంబినేషన్ నిర్మాణాన్ని తీసుకురానున్నట్లు చెప్పింది. ఇంటర్ ఆపరేబిలిటీ, క్లౌడ్ న్యూట్రాలిటీని రూపొందిస్తామని వివరించింది. రాబోయే రోజుల్లో 6 రెట్ల GMV పెరుగుదలను అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
చిన్న, మధ్యతరహా సంస్థల భాగస్వామ్యాన్ని మరింత పెంచే విధంగా GeMలో మార్పులు చేయనున్నట్లు టెక్ దిగ్గజం వెల్లడించింది. కొత్త విక్రేతలకు సులభ ఆన్ బోర్డింగ్ సహా వైవిధ్యమైన సెల్లర్ బేస్ తయారీకి ప్రయత్నించనున్నట్లు తెలిపింది. సప్లై చైన్, డేటా అనాలసిస్ మెరుగుపరచేందుకు, సంభావ్య మోసాలను అరికట్టేందుకు అధునాతన AI మరియు ML సాంకేతికలను వినియోగించనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం మార్కెట్ ప్లేస్ కు 70 వేల కంటే ఎక్కువ కొనుగోలు సంస్థలు, 65 లక్షల ప్రొవైడర్స్, 8 లక్షల చిన్న మధ్యతరహా పరిశ్రమల సపోర్డ్ ఉంది. ఏటా 2 లక్షల కోట్ల గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (GMV) కలిగి ఉంది. ప్లాట్‌ఫారమ్ విజయవంతంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, స్కేల్-అప్ విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటోంది. వినియోగదారుల పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో వెనకబడి ఉంటోంది. దీనిని మార్చేందుకే TCS రంగంలోకి దిగనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications