Rural Poor: గ్రామీణ పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఉపాధి హామీ పథకంపై కీలక నిర్ణయం
MGNREGA Wages hike: అతి త్వరలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దానికి ముందు ఉద్యోగులకు DA పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దాదాపు కోటి మంది లబ్ధిపొందనున్నట్లు అంచనా. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం కూడా కీలక ఆదేశాలు జారీచేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మరీ MGNREGA వేతన రేట్ల సవరణను ప్రకటించింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కార్మికులకు వేతన రేట్లను కేంద్రం సవరించింది. 3 నుంచి 10 శాతం మేర పెంచాలని నోటిఫై చేసింది. కొత్త వేతనాలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. FY23-24కి 261 సగటు వేతనం కాగా 2024-25 ఏడాదికి 28 పెరగనుంది.

10.56 శాతం పెరగుదలతో గోవా మొదటి స్థానంలో నిలవగా కర్ణాటక 10.4 శాతంతో వెన్నంటే ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లలో వేతన రేట్లు అత్యల్పంగా 3 శాతం పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (10.29%), తెలంగాణ (10.29%), ఛత్తీస్‌గఢ్ (9.95%)లోనూ బలమైన పెరుగుదల కనిపించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించే CPI-AL (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్- అగ్రికల్చర్ లేబర్)లో మార్పుల ఆధారంగా ఉపాధి హామీ (MGNREGA) వేతనాలు నిర్ణయించబడతాయి. ఇందుకు అదనంగా రాష్ట్రాలు కూడా లబ్ధిదారులకు ఎక్కువ వేతన రేటును అందించవచ్చు. ఇలా చూస్తే హర్యానా ప్రజలు రోజుకు గరిష్ఠంగా 374, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్‌లలో అత్యల్పంగా రోజుకు 234 వేతనం పొందుతున్నారు.


Click it and Unblock the Notifications