న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, ఉత్పత్తి- ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెట్టింపు అవుతోంది. అన్ని ప్రముఖ ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మీద దృష్టి సారించాయి. దీనికి అనుగుణంగా- పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీని అమలులోకి తీసుకుని వచ్చిన తరువాత ఈవీల మీద దృష్టి సారించారు వాహనదారులు.
ఇదివరకెప్పుడూ లేనిసంఖ్యలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ రోడ్ల మీద కనిపిస్తోన్నాయి. ఫోర్ వీలర్స్ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మారుతి సుజుకి, కియా, టయోటా.. వంటి టాప్ కార్ మేకర్స్ వీటి తయారీకి ప్రాధాన్యత ఇస్తోన్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశించాయి.

ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ట్రక్కులను కూడా తీసుకుని రావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలను వ్యవసాయ అవసరాల కోసం వినియోగించేలా ట్రాక్టర్, ట్రక్ మేకర్స్ రంగం సిద్ధం చేశాయి. క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత ప్రోత్సహించేలా అటు కేంద్ర ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా- ఇందులో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల వస్తు, సేవా పన్నులను తగ్గించాలని భావిస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న జీఎస్టీ శాతం.. 18. దీన్ని తగ్గించేలా జీఎస్టీ కౌన్సిల్‌లో తీర్మానం చేయొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలపై వసూలు చేస్తోన్న జీఎస్టీని లిథియం అయాన్ బ్యాటరీలను కూడా వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలపై అమలు చేస్తోన్న జీఎస్టీ అయిదు శాతమే. లిథియం అయాన్ బ్యాటరీలను కూడా 18 నుంచి అయిదు శాతానికి తగ్గించితే దానికి అనుగుణంగా రేట్లు కూడా అందుబాటులోకి వస్తాయని అభిప్రాయం ఉంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీని మరింత ముమ్మరం చేయడానికి కూడా ఇది దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్స్ స్కీమ్‌లో భాగంగా ఉత్పత్తిని భారీగా పెంచవచ్చని చెబుతున్నాయి. ఈ రంగంలో 18,100 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని, ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉందనీ అభిప్రాయపడుతున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications