గుడ్‌న్యూస్: ఆ ఎఫెక్ట్, కొద్దిరోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి?

త్వరలో ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఇటీవల వినియోగదారులకు షాకిస్తోన్న విషయం తెలిసిందే. పన్నుల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు అదనంగా పన్నులు విధిస్తాయి.

గత ఏడాది కొన్ని రాష్ట్రాలు కరోనా సెస్‌ను తెచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారాయి. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్చించుకొని ధరలు తగ్గించవచ్చునని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పలుమార్లు చెప్పారు. ఈ మేరకు ఈ చర్యలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్చలు ముందుకు సాగితే పన్ను భారం కాస్త తగ్గవచ్చు.

18 నెలల గరిష్టానికి చమురు ధరలు

18 నెలల గరిష్టానికి చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 18 నెలల గరిష్టానికి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు షాకిస్తున్నాయి. ధరలను తగ్గించాలని ఓ వైపు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలు కూడా ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల చమురు ధరలు 70 డాలర్లు దాటినప్పటికీ, గత పది రోజులుగా దేశీయంగా మాత్రం ధరల్లో ఎలాంటి మార్పులేకపోవడం వినియోగదారుడికి ఊరట కలిగించే అంశం.

మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 కూడా క్రాస్ చేసింది. జనవరి 1, 2021న ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.85కు కాస్త అటు ఇటుగా ఉంది. ఇప్పుడు రూ.90 క్రాస్ చేసింది. ముంబైలో రూ.90గా ఉన్న ధర ఈ రెండు నెలల కాలంలో రూ.95ని క్రాస్ చేసింది.

ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఎంతంటే

ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఎంతంటే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చమురు పైన భారీగా పన్నులు వసూలు అవుతాయి. ఏడాదికి దాదాపు రూ.5.5 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వాలు వసూలు చేస్తాయి. ఒకవేళ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే ఈ ఆదాయం రూ.2.5 లక్షల కోట్లకు పడిపోతుందనే అంచనాలు ఉన్నాయి. జీఎస్టీలో గరిష్టంగా 28 స్లాబ్ ఉంది. కానీ పెట్రోల్, డీజిల్‌లో సగానికంటే ఎక్కువ పన్నులే. కాబట్టి 28 స్లాబ్‌లోకి వస్తే పెట్రోల్ రూ.75 వరకు లీటర్ అవుతుందని అంచనా.

ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.86.30గా ఉంటే బేస్ ధర రూ.29.34, రవాణా ఖర్చు 0.37 పైసలు. మొత్తం రూ.29.71 అవుతుంది. అంటే ఖర్చుతో పాటు పెట్రోల్ ధర రూ.30 వరకు ఉంది. ఆ తర్వాత ఎక్సైజ్ డ్యూటీ రూ.32.98, వ్యాట్ రూ.19.92, డీలర్ కమిషన్ రూ.3.69. దీంతో ఈ ధర రూ.86 దాటుతుంది.

త్వరలో నిర్ణయం

త్వరలో నిర్ణయం

కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్ ఇటీవల మాట్లాడుతూ పెట్రోల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించడమే పెరుగుతున్న ధరలకు ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని భావిస్తోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చముర వినియోగదారు భారత్. భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడుతోంది.

దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడల్లా దేశీయ మార్కెట్లోను పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. రిటైల్ ధరల్లో దాదాపు అరవై శాతం పన్నులు, సుంకాలు ఉంటాయి. చమురు ధరలు తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాలు, చమురు సంస్థలు, చమురు మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా సామాన్యులపై భారం తగ్గించే ఆలోచన చేస్తోంది. మిడిల్ మార్చి నాటికి సుంకం తగ్గింపు లేదా ధరల స్థిరీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ఇదివరకే వార్తలు వచ్చాయి. ధరల స్థిరీకరణపై చర్చలు సాగుతున్నాయని, ఈ నెలలో నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+