Budget 2024: మధ్యంతర బడ్జెట్‌లో మరిన్ని తాయిలాలు.. స్టాండర్డ్ డిడక్షన్‌పై కీలక ప్రకటన?
Standard Deduction: ఫిబ్రవరి 1న 2024 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల ముందు తీసుకురానున్న పద్దు కావడంతో ఇందులో అనేక తాయిలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కారు కీలక ప్రతిపాదనలు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు.
గృహ రుణాలకు సంబంధించి వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని ఈ బడ్జెట్‌లో కేంద్ర పెంచనుందని ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి తోడు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలోనూ గుడ్‌న్యూస్ వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ పరిమితిని 50 వేల నుంచి లక్షకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం.

పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తుల ఆదాయంపై డైరెక్ట్‌గా క్లెయిమ్ చేయగల స్థిరమైన మినహాయింపు స్టాండర్డ్ డిడక్షన్. పెట్టుబడిపై రుజువును చూపించాల్సిన అవసరం లేకుండానే మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు. 1974లో దీన్ని ప్రవేశపెట్టగా 2019లో పరిమితిని 50 వేలుగా సర్దుబాటు చేశారు. అయితే ఈ ప్రయోజనం పాతపన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. అయితే 2023 నుంచి కొత్త ట్యాక్స్ విధానానికీ దీన్ని విస్తరించారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ సరిపోదని ఆనంద్ రాఠి అడ్వైజర్స్ లిమిటెడ్ నివేదిక అభిప్రాయపడింది. వ్యాపారులతో సమానంగా ఉద్యోగులు పన్ను ప్రయోజనాలు పొందేందుకు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోని ఉద్యోగుల ఆఫీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఖర్చులను భర్తీ చేయడానికి, పరోక్షంగా GST ఆదాయం పెంచేందుకు, పెరిగిన వైద్య బిల్లులను సమన్వయం చేసేందుకు ఈ చర్య ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications