NPS News: NPS రూల్స్ మార్చేసిన కేంద్రం.. ఇన్వెస్టర్ల ప్రయోజనం కోసం PFRDA కీలక నిర్ణయం
NPS rules change: కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పలు సంస్థల నిబంధనలకు మరియు వివిధ ప్రభుత్వ పథకాలకు మోదీ సర్కారు మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులతో సంబంధం కలిగిన EPF రూల్స్, కార్మిక చట్టాలు, మహిళా ప్రభుత్వోద్యోగులకు శెలవులు వంటి నిబంధనలను సవరించింది. మరో స్కీమ్ విషయంలోనూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కాగా దాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహణలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో భారీ మార్పునకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సబ్‌స్క్రైబర్‌లకు ప్రయోజనం చేకూర్చే చర్యలకు దిగింది. జూలై 1, 2024 నుంచి కేవలం ఒక్క రోజులోనే NPS అమౌంట్‌ను సెటిల్‌మెంట్ చేసే విధంగా నిబంధనలకు మార్పులు చేసింది.

కొత్త పాలసీ ప్రకారం.. ఏదైనా సెటిల్‌మెంట్ రోజున ఉదయం 11 గంటల వరకు ట్రస్టీ బ్యాంక్ (TB) ద్వారా స్వీకరించబడిన చందాలు అదే రోజున ఇన్వెస్ట్ చేయబడతాయని స్పష్టం చేసింది. తద్వారా పెట్టుబడి పెట్టిన రోజు వర్తించే నికర ఆస్తి విలువ (NAV) ప్రయోజనం పొందే అవకాశం లభిస్తుంది. అయితే 11 తర్వాత అందిన విరాళాలు మాత్రం మరుసటి రోజు (T+1) సైకిల్ కిందే పెట్టుబడిగా స్వీకరించనుంది.
ఈ టైమ్‌లైన్‌లో మార్పు చందాదారులకు వేగవంతమైన పెట్టుబడుల యాక్సెస్ తో పాటు అధిక రాబడిని అందిస్తుంది. పొడిగించిన సమయం ప్రభుత్వ నోడల్ కార్యాలయాలు, పాయింట్లు (PoPలు), eNPS, D-రెమిట్, UPI వంటి ఇతర ఛానెళ్లు లేదా TBల వంటి అన్ని రకాల మార్గాల ద్వారా స్వీకరించబడిన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వర్తిస్తుంది. గత 6 నెలల్లోనే కొత్తగా ఆన్‌లైన్ ఉపసంహరణ సహా పలు కీలక మార్పులు చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications