F&O News: తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడకుండా భారీగా సంపాదించాలని పలువురు భావిస్తున్నారు. ఇందుకోసం కొందరు లాటరీలు, జూదం వంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు. మరికొందరు స్టాక్ మార్కెట్ ద్వారా ఇంట్లో కూర్చుని కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే వీరిలో ఇన్వెస్ట్మెంట్ కంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(F&O)లో ట్రేడింగ్ ద్వారా భారీ మొత్తంలో వెనకేసుకుంటున్నారు. ఇది అంతా నాణేనికి ఒకవైపు కాగా మరోవైపుని చూసి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది.
స్టాక్ మార్కెట్ లోని F&Oసెగ్మెంట్ ద్వారా ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో నష్టపోతున్నట్లు సాక్షాత్తు సెబీనే ఇన్వెస్టర్లను హెచ్చరిస్తోంది. కేవలం 9 శాతం మంది మాత్రమే లాభపడుతుండగా 91 శాతం సర్వం కోల్పోతున్నారు. అయినప్పటికీ ఏడాదికేడాది రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఈ సెగ్మెంట్లో పెరుగుతూ వస్తుంది. దీనిని కట్టడి చేయడానికి నియంత్రణ సంస్థలు సహా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుంది. ఈ తరహా ప్రాక్టీస్‌కు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది.

త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ సెగ్మెంట్ కు సంబంధించి కీలక డెసిషన్ ఉండనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ సాధ్యమైనంత వరకు తగ్గించేలా చర్యలు ఉండాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో F&O ద్వారా సంపాదించిన మొత్తాన్ని ఇప్పటివరకు వ్యాపార ఆదాయంగా పరిగణిస్తుండగా.. ఆ హోదా నుంచి దాన్ని తొలగించాలని ప్రభుత్వం చూస్తోంది. తద్వారా క్రిప్టో కరెన్సీలతో సమానంగా ఇకపై IT శాఖ వాటిపై పన్ను విధించే అవకాశమూ లేకపోలేదు.
F&Oలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కేవలం స్పెక్యులేటివ్‌గా మాత్రమే ఉంటోందని ప్రభుత్వం భావిస్తుంది. వారిలో సింహభాగం పరిశోధించి ఇన్వెస్ట్ చేయకుండా కేవలం మోసగాళ్ల టిప్స్‌పై ఆధారపడతారు కాబట్టి నష్టాలు పాలవుతున్నట్లు అంచనా వేస్తుంది. ఇదే విషయంపై RBI కూడా ఇటీవల సెబీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా F&O విభాగంపై నెగటివ్ కామెంట్స్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications