న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం.. తన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. డిజిన్వెస్ట్‌మెంట్ కార్యకలాపాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో పరుగులు పెట్టించనుంది. ఎయిరిండియా, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తరహాలోనే ఇంకొన్ని కంపెనీల అమ్మేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)ని ప్రైవేటీకరించడానికి ముహుర్తాన్ని ఖాయం చేసింది. జులై రెండోవారంలో ఐడీబీఐ బ్యాంక్ నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించుకునేలా ప్రతిపాదనలను రూపొందించుకుంది. వచ్చే నెల దీనికి అవసరమైన ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంటరెస్ట్ ప్రిలిమినరీ బిడ్లను 15 నుంచి 20 తేదీల మధ్య ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తోన్నాయి.

రెండోవారం నుంచి ఐడీబీఐ ప్రైవేటీకరణ కోసం అమెరికాలో కూడా రోడ్‌షోలను నిర్వహించనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ పబ్లిక్ అస్సెట్స్ మేనేజ్‌మెంట్ (దీపం) వీటిని పర్యవేక్షించనుంది. బిడ్డింగ్స్ కోసం ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికను రూపొందించింది. కొన్ని చోట్ల అమలు చేస్తోంది కూడా.
ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా.. 45.48 శాతం. మెజారిటీ స్టేక్స్ ఎల్ఐసీ పేరు మీద ఉన్నాయి. ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉందీ బ్యాంక్‌లో. ఇందులో తన వాటా మొత్తాన్ని కూడా విక్రయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై స్పష్టత లేదు. కేంద్రం ఎంతమేర తన వాటాను విక్రయిస్తుందనే విషయం నిర్ధారణ కాలేదు.
దీనిపై త్వరలోనే ఓ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరిస్తామంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇదివరకే ప్రకటించారు. దీనికి ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర కేబినెటీ సబ్ కమిటీ ఆమోదముద్ర సైతం వేసింది. చట్టంలో మార్పులను తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం.
ప్రైవేటీకరణ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్లను అపాయింట్ చేసింది. ఎల్ఐసీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ అంచనాలు తప్పాయి. పబ్లిక్ ఇష్యూ కోసం తీసుకుని రాగా.. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. 902 నుంచి 949 రూపాయల కటాఫ్ ప్రైస్‌తో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ జారీ చేసింది. లిస్టింగ్ తరువాత ఎల్ఐసీ షేర్ల విలువ దారుణంగా పడిపోయింది.


Click it and Unblock the Notifications