Youth Ideas: నైపుణ్యం కలిగిన, తెలివైన యువతకు దేశంలో కొదువలేదు. సరిగ్గా ఇదే పాయింట్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే గతంలో మాదిరిగా అన్నింటినీ ప్రభుత్వ విభాగాలతో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకోవడం లేదు. యువత ఆలచోనలు, ఆశయాలు ఆయా రంగాల్లో అమలు చేయాలని భావిస్తోంది.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మార్చాలి అనే విషయంపై కేంద్రం ఓ విజన్ డాక్యుమెంట్‌ను జనవరిలో ఆవిష్కరించనుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏమి చేయాలి, వీక్షిత్ భారత్@2047ను సాధ్యం చేయడానికి ఎలా ముందుకెళ్లాలి వంటి వ్యవహాలపై యువత ఆలోచనలు తీసుకోవాలని ప్రధాని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

ఇందులో భాగంగా 'వీక్షిత్ భారత్@2047: వాయిస్ ఆఫ్ యూత్'ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజ్ భవన్ లలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్‌లలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఆయా ఇనిస్టిట్యూట్ ల అధిపతులు, ఫ్యాకల్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
వీక్షిత్ భారత్2047 ముసాయిదా పత్రం దాదాపు సిద్ధమైనట్లు విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్న నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ BVR సుబ్రహ్మణ్యం తెలిపారు. పరిశ్రమ వర్గాలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖలతో చాలా సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు యువతను ఆహ్వానించడం ద్వారా వారి వినూత్న ఆలోచనలను దేశాభివృద్దికి వినియోగించాలని భావిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications