Stock market: ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందుకు అనుగుణంగా పలు సవరణలతో తాజాగా ఫైనాన్స్ బిల్లు సైతం లోక్ సభలో ఆమోదం పొందింది. ఈ సమావేశంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను ప్రభావితం చేసే నిర్ణయం ఒకటి ప్రభుత్వం తీసుకుంది. ఫ్యూచర్స్ ట్రేడర్లు చెల్లిస్తున్న పన్ను పెంచనున్నట్లు ప్రకటించిందిత.
ఫ్యూచర్స్ విభాగంపై 25 శాతం:
ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ (F&O) కాంట్రాక్టుల విక్రయంపై ఉన్న సెక్యూరిటీల లావాదేవీ పన్ను (STT)ని 25 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఫ్యూచర్స్ సేల్ కోటి టర్నోవర్‌పై ఇంతకు ముందు రూ.1,000 STT విధిస్తుండగా.. తాజా పెంపుతో అది రూ.1,250కి చేరుతుందన్నమాట. ఈ చర్యతో వాల్యూమ్‌లు ప్రభావితం కానుండగా.. స్టాక్ ఎక్స్ఛేంజీలలో F&O ట్రేడింగ్ ఖర్చు సైతం ప్రభావితం కానుంది.

ఆప్షన్స్ మీద పెంపు ఎలా ఉందంటే..
ఆప్షన్స్ విక్రయంపై సైతం STTని 0.05 శాతం నుండి 0.0625 శాతానికి పెంచాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. అంటే, రూ. కోటి టర్నోవర్‌పై ప్రస్తుతం 5 వేలు పన్ను చెల్లిస్తున్నారు. ఈ మొత్తం ఇప్పుడు రూ.6,250 కానుంది. ఈ మేరకు ఫైనాన్స్ బిల్లోలు సవరణలు చేసింది. ఆప్షన్స్ వ్యవహారంలో ప్రస్తుతం ఉన్న రూ.1,700 లను రూ.2,100కి పెంచినట్లు తప్పుగా పేర్కొన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీనిని "టైపోగ్రాఫికల్ ఎర్రర్"గా చెబుతూ, సోమవారం సవరణలలో దిద్దుబాటుగా చేర్చనున్నట్లు వెల్లడించారు.
వాల్యూమ్లపై ప్రభావం తప్పదు:
ప్రభుత్వ నిర్ణయంతో స్టాక్ ఎక్స్ఛేంజీలలో, ముఖ్యంగా NSEలో హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ (HFT) దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. STT పెంపు తర్వాత వాల్యూమ్‌లు సైతం తగ్గనున్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత సెన్సెక్స్ 398 పాయింట్లు(0.69 శాతం) నష్టపోయి 57,527.10 వద్దకు పడిపోయింది. అయితే SEBI అధ్యయనం ప్రకారం.. ఈక్విటీ F&O విభాగంలో వ్యక్తిగత వ్యాపారుల సంఖ్య FY22 చివరి నాటికి 500 శాతం పెరిగి 4.5 మిలియన్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications