interest rates: ఆడపిల్లల తల్లిదండ్రులకు కేంద్రం శుభవార్త.. ఆ స్కీమ్‌పై భారీగా పెరిగిన వడ్డీ రేటు

Sukanaya Samriddhi Yojana: ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడి మార్గాల్లో 'సుకన్య సమృద్ది యోజన'కు మంచి పేరుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఇదొక వరమని చెప్పవచ్చు. ప్రభుత్వ గ్యారెంటీతో ఎక్కువ వడ్డీ అందిచడం ఈ స్కీమ్ ప్రత్యేకత. కాగా మోదీ సర్కారు ఈ పథకంపై లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది.

జనవరి-మార్చి 2024 త్రైమాసికానికిగాను సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది. 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్ పై ఇంటరెస్ట్ శాతాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. గతంలో 8.0 శాతంగా ఉన్న వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచుతూ 8.2 శాతంగా నిర్ణయించింది.

Centre increased interest rates for Sukanya Samridhi Yojana scheme

వ్యక్తిగత ఆదాయపు పన్ను నుంచి మినహాయింపులు పొందేందుకు ఈ చిన్న మొత్తాల పొదుపు పథకం మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. సెక్షన్ 80C ప్రకారం గరిష్ఠంగా 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. తాజాగా వడ్డీ రేట్ల పెంపుతో మరికాస్త ఎక్కువ రిటర్న్ పొందే అవకాశమూ లభిస్తోంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పథకాలు మంచి వడ్డీ జనరేట్ చేయడంతో పాటు వాటికి ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. అందువల్ల రిస్క్ చాలా తక్కువని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్స్ అందిస్తున్న వడ్డీ రేట్లు.. బ్యాంకులు ఇస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇంటరెస్ట్‌కు దాదాపు సమానంగా ఉంటున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+