ఫ్యూయల్ ఎగుమతిదారులకు షాక్.. డీజిల్, జెట్ ఫ్యూయల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను నిర్ధారించడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల చమురు ఎగుమతిదారులు అక్రమ ప్రయోజనం పొందకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF-విమాన ఇంధనం) ఎగుమతులపై విండ్‌ఫాల్ గెయిన్స్ పన్నును (Windfall Gains Tax) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అయితే, పెట్రోల్‌పై ఉన్న పన్నును మాత్రం యథాతథంగా కొనసాగించింది. జూన్ 16 నుండి ప్రారంభమయ్యే రాబోయే పక్షం రోజుల (15 రోజులు) కాలానికి ఈ సరికొత్త సుంకాల రేట్లు అమల్లోకి రానున్నాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇంధన ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED) సవరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డీజిల్ ఎగుమతిపై ప్రస్తుతం ఉన్న పన్ను రేటు లీటరుకు రూ. 13.5 నుండి రూ. 14కి పెరిగింది. అలాగే విమాన ఇంధనమైన ఏటీఎఫ్ ఎగుమతిపై సుంకం లీటరుకు రూ. 9.5 నుండి ఏకంగా రూ. 12.5కి పెంచబడింది.
మరోవైపు, పెట్రోల్ ఎగుమతులపై ఉన్న సుంకం రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా, దానిని లీటరుకు రూ. 1.5 గానే యథాతథంగా కొనసాగించారు. విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనాలపైనే ఈ అదనపు పన్నుల భారం పడనుండగా, దేశీయ వినియోగం కోసం క్లియర్ చేయబడిన పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం ఉన్న సాధారణ సుంకం రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ విండ్‌ఫాల్ పన్ను విధింపు వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు, దానికి ప్రతిగా జరిగిన భారీ ప్రతీకార చర్యల కారణంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
ఈ అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, భారతీయ చమురు కంపెనీలు దేశీయ అవసరాలను పక్కనబెట్టి, విదేశాల్లో లభించే అధిక ధరల కోసం ఇంధనాన్ని భారీగా ఎగుమతి చేయకుండా నిరుత్సాహపరచడమే ఈ పన్ను యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకోసమే ప్రభుత్వం మార్చి 26న డీజిల్, ఏటీఎఫ్‌లపై ఎగుమతి సుంకాన్ని విధించి, ప్రతి పక్షం రోజులకు ఒకసారి అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా రేట్లను సవరిస్తూ వస్తోంది. ఆ తర్వాత మే 16న పెట్రోల్‌పై కూడా ఈ ఎగుమతి సుంకాన్ని వర్తింపజేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
