DA hike: కేంద్ర ఉద్యోగులకు 16 శాతం DA పెంపు.. కొందరికి మాత్రమేనని ఆర్థిక శాఖ వెల్లడి
DA hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 5వ పే కమీషన్ ప్రకారం జీతాలు పొందుతున్న కేంద్ర ప్రభుత్వ మరియు కేంద్ర అటానమస్ బాడీల ఉద్యోగులకు 16 శాతం కరువు భత్యం(DA) ఇవ్వడానికి నిర్ణయించింది. తద్వారా మునుపటి DA రేటు బేసిక్ పేలో 396 శాతం కాగా.. తాజా పెంపు తర్వాత ఇది 412 శాతానికి చేరనుంది. సవరించిన DA రేటు జనవరి 1, 2023 నుండి వర్తిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపిన ఆఫీస్ మెమోరాండంలో ఈ మేరకు వెల్లడించింది.
6వ సెంట్రల్ పే కమీషన్ కింద సవరించిన పే స్కేల్/గ్రేడ్ పే ప్రకారం వేతనాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఈ బెనిఫిట్ అందుకున్నారు. ఏప్రిల్ 2023లో వీరికి DA రేటును 212 నుంచి 221 శాతానికి పెరిగింది. కాగా ఇప్పుడు 5వ పే కమీషన్ కింద ఉన్న వేతన జీవుల DA పెంపునకు ఆర్థిక శాఖ నిర్ణయించింది.

ఇక 7వ పే కమీషన్ ప్రకారం జీతం పొందుతున్న కేంద్ర ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్‌నెస్ అలవెన్స్ పైనా ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. 1 జనవరి 2023 నుంచి బేసిక్ పేలో DAను 38 నుంచి 42 శాతానికి పెంచింది. ఈ పెంపు గురించి ఏప్రిల్ 2023లోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇదే పే స్కేల్‌లో పెన్షన్ పొందుతున్న వారికి సైతం DR రేటును 38 నుంచి 42 శాతానికి హెచ్చించింది.
ఇదిలా ఉండగా, జూలైలో మరో కరవు భత్యం పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ దఫా DA హైక్ 42 నుంచి 45 శాతానికి పెంచవచ్చని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి..


Click it and Unblock the Notifications