ఎస్బీఐకి కొత్త సారథి: ఏరికోరి అపాయింట్ చేసిన కేంద్ర ప్రభుత్వం: బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో
న్యూఢిల్లీ: దేశంలో లీడ్ బ్యాంక్‌గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాయకత్వం మారింది. కొత్త సారథి అపాయింట్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. బ్యాంక్ బ్యురో బోర్డ్ రూపొందించిన ప్రతిపాదనలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆయనే- అలోక్ కుమార్ చౌదరి. ప్రస్తుతం భారతీయ స్టేట్‌బ్యాంక్ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తోన్నారు. ఆయనకు పదోన్నతి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. రెండు సంవత్సరాల పాటు ఆయన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.
ఆ తరువాత ఆయన పదవిని కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఎస్బీఐ ఎండీగా అలోక్ కుమార్ చౌదరిని పేరును సిఫారసు చేస్తూ ఈ ఏడాది మార్చిలో బ్యాంక్ బోర్డ్ బ్యురో.. కేంద్ర ప్రభుత్వానికి తన ప్రతిపాదనలను పంపించింది. తాజాగా ఆయన పేరును ఆమోదించింది కేంద్రం.

ప్రస్తుతం ఎస్బీఐ ఎండీగా అశ్వని భాటియా పని చేస్తోన్నారు. కొద్దిరోజుల కిందటే ఆయనకు స్థానం చలనం కలిగింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి బదిలీ అయ్యారు. సెబి హోల్ టైమ్ సభ్యుడిగా అపాయింట్ అయ్యారు. దీనితో అలోక్ కుమార్ చౌదరికి కేంద్ర ప్రభుత్వం ఎండీగా ప్రమోట్ చేసింది. కేబినెట్ అపాయింట్స్ కమిటీ ఈ మేరకు తన తుది ఉత్తర్వులను జారీ చేసింది.
అలోక్ కుమార్ చౌదరి 1987లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్బీఐలో జాయిన్ అయ్యారు. 32 సంవత్సరాలుగా ఆయన ఈ బ్యాంక్‌తో అసోసియేట్ అయి ఉన్నారు. అహ్మదాబాద్‌లో బ్యాంక్ నెట్‌వర్క్ 1 జనరల్ మేనేజర్, ఢిల్లీలో బిజినెస్ అండ్ ఆపరేషన్స్ డిప్యూటీ జీఎంగా, నార్త్ ఈస్ట్ సర్కిల్‌లో ఎల్‌హెచ్‌ఓగా పని చేశారు. బ్యాంక్ మానవ వనరుల విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్‌గానూ వ్యవహరించారు.
ఇటీవలే బ్యాంక్ బోర్డ్ బ్యూరో కొన్ని బ్యాంకులకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్లను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా మణిమేఖలై, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సారథిగా అజయ్ కుమార్ శ్రీవాస్తవ్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌కు స్వరూప్ కుమార్ సాహాలను నియమించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications