Ride sharing: బైక్ ట్యాక్సీ సేవలు నిరుద్యోగులకు ఓ వరంలా మారాయి అనడంలో సందేహం లేదు. ఎటువంటి అనుభవం, నైపుణ్యాలు లేకపోయినా కేవలం బైక్ రైడింగ్ వస్తే చాలు ఎంతోకొంత సంపాదించుకునే మార్గం చూపించాయి. అయితే ఇటీవల వీటిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధిస్తుండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) బైక్ ట్యాక్సీ సేవలపై కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల (MV) చట్టం ప్రకారం మోటార్‌సైకిళ్లను కాంట్రాక్ట్ క్యారేజీలుగా వర్గీకరించడాన్ని హైలైట్ చేసింది. దీంతో ఢిల్లీ మరియు మహారాష్ట్ర వంటి మెట్రో నగరాల్లో ఈ సేవలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి మార్గం సుగమం చేసింది.

సరైన వాణిజ్య లైసెన్స్ లేకుండా బైక్ ట్యాక్సీలను నడపడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. ఇందుకుగాను వెయ్యి వరకు జరిమానా సహా 3 సంవత్సరాల పాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని ప్రకటించింది. బైక్ టాక్సీ సేవలు మహారాష్ట్ర మరియు ఢిల్లీలో నిషేధాన్ని ఎదుర్కొన్నప్పటికీ.. గోవా, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ కార్యకలాపాలను అనుమతించాయి.
MoRTH కొత్త మార్గదర్శకాల ప్రకారం.. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు MV చట్టంలోని నిబంధనలు అనుసరించాలని కేంద్రం ఆదేశించింది. మోటార్ సైకిళ్ల కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్‌ల కోసం దరఖాస్తులను ఆమోదించాలని, వాటిని ప్రాసెస్ చేయాలని సూచించింది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications