కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, వంట నూనెల ధరలు తగ్గుతాయి!

ఇటీవల వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ధరలు దాదాపు 30 శాతం వరకు పెరిగాయి. అయితే సెకండ్ వేవ్ తర్వాత కాస్త తగ్గినప్పటికీ, మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో వంటనూనె అంటేనే వినియోగదారులు అల్లాడిపోయే పరిస్థితి నెలకొంది. మున్ముందు వంట నూనెల ధరలు మరింత పెరిగే ఆస్కారం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వివిధ రకాల నూనెల పైన దిగుమతి సుంకాన్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

అందుకే ధరలు తగ్గాయి

అందుకే ధరలు తగ్గాయి

నూనె ధరలు కేవలం దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో సోయా ఉత్పత్తి తగ్గిపోవడం, ఇండోనేషియాలో పామాయిల్ ధరలు పెరగడం వంటి వివిధ అంశాలు ప్రభావం చూపాయి. దీంతో రాబోయే రోజుల్లో వంట నూనెల ధరలు పెరుగుతాయని భావించారు. అయితే కేంద్రం ధరలు తగ్గించే దిశగా లేదా స్థిరంగా ఉంచే దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి సామాన్యుడిపై మరింత భారం పడకుండా ప్రయత్నాలు చేస్తోంది.

దిగుమతి సుంకం తగ్గింపు

దిగుమతి సుంకం తగ్గింపు

ముడి పామాయిల్ పైన ఇప్పటి వరకు 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించి, భారీ ఊరటను కల్పించింది. ముడి సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ నూనె పైన ఉన్న 7.5 శాతం సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించింది. అన్ని రకాల రిఫైన్డ్ ఆయిల్స్‌ పైన దిగుమతి సుంకాన్ని 37.75 శాతం నుండి 32.5 శాతానికి తగ్గించింది. తాజా ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలిపి మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గుతాయి. రిఫైన్డ్ ఆయిల్స్ పైన ఉన్న పన్ను 35.75 శాతానికి తగ్గుతుంది. దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండోసారి తగ్గింపు

రెండోసారి తగ్గింపు

సుంకాలను కేంద్రం తగ్గించడం ఇది రెండోసారి. ఇంతకుముందు దిగుమతి సంకాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రం తగ్గింపు ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకు పప్పు ధాన్యాల‌పై దిగుమ‌తి సుంకాలు త‌గ్గించిన కేంద్రం ఆకాశాన్ని తాకే రీతిలో దూసుకెళ్లే వంట నూనెల ధ‌ర‌ల‌ను త‌గ్గించి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేయడాలని నిర్ణయించింది. ట్రేడర్స్, హోల్ సేల్ వ్యాపారులు త‌మ వ‌ద్ద ఉన్న వివిధ ర‌కాల నూనెల నిల్వ‌ల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని కూడా ఆదేశించింది.

తినదగిన నూనె ధరలు ఇటీవల పెరిగిన నేపథ్యంలో కస్టమర్లకు తెలిసేలా రిటైలర్స్ అన్ని బ్రాండ్స్ నూనె ధరలను ప్రముఖంగా ప్రదర్శించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. శుక్రవారం రాష్ట్రాల ప్రతినిధులు, పరిశ్రమ వాటాదారులతో సమావేశం అనంతరం వ్యాపారుల స్టాక్ పైన కూడా పరిమితిని విధించింది. ఈ నెలాఖరు నాటికి కొత్త ఖరీఫ్ పంట రాకతో పాటు ప్రపంచ మార్కెట్లో సానుకూల ధోరణి, అలాగే కేంద్రం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో వంట నూనెల ధరలు తగ్గవచ్చునని అంటున్నారు. ఇదిలా ఉండగా, అక్టోబర్ నెల నుండి సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలు పది శాతం నుండి పదకొండు శాతం మేర పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+