ఈ మధ్య అందరూ "రూ. 2,000కి పైగా UPI ద్వారా చెల్లిస్తే GST పడుతుంది!" అని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చింది.

భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇటీవల ప్రజలకు వస్తు, సేవల పన్ను(GST) సంబంధించి ఒక ముఖ్యమైన స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వేదిక మీద రూ. 2,000కి పైగా జరిగే లావాదేవీలపై GST విధించేందుకు ఎటువంటి ప్రణాళిక లేదా ప్రతిపాదన లేదని మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించారు. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో, వార్తా సందర్భాలలో వచ్చిన అపోహలను నివారిస్తుంది.
GST మరియు UPI లావాదేవీలు
GST అనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాల వంతుగా విధించే రెండు భాగాలలో ఉంటుంది: CGST (సెంట్రల్ GST) మరియు SGST (స్టేట్ GST). కానీ, మనం యూపీఐ (UPI) ద్వారా చేసే డబ్బుల లావాదేవీలపై సాధారణంగా GST వర్తించదు. వ్యక్తిగతంగా (P2P) డబ్బులు పంపినా, వ్యాపారానికి (P2M) చెల్లించినా, UPI పేమెంట్లపై పన్ను వేయరు. 2019 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం MDR (Merchant Discount Rate) అనే అదనపు ఛార్జ్‌ను రద్దు చేసింది. దాంతో UPI పేమెంట్లు పూర్తిగా ఉచితంగా మారాయి. అందుకే, ఇప్పుడు మీరు యూపీఐ ద్వారా చేసే లావాదేవీలపై GST విధించే పరిస్థితి లేదు.
UPI అనేది మనం వెంటనే డబ్బులు పంపేందుకు ఉపయోగించే ఒక సులభమైన సాంకేతిక వ్యవస్థ. దీని ప్రధాన ఉద్దేశ్యం డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం మాత్రమే. కానీ UPI లావాదేవీలపై ప్రభుత్వం GST వసూలు చేస్తుందన్న వార్తలు వచ్చినా, అవి తప్పు అని కేంద్రం చెప్పింది.
ఇటీవల కర్ణాటకలో కొన్ని చిన్న వ్యాపారులకు UPI ద్వారా వచ్చిన డబ్బుల ఆధారంగా GST నోటీసులు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ నోటీసులను రాష్ట్రంలోని వాణిజ్య పన్ను శాఖ మాత్రమే జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయం ప్రజల్లో అపోహలు కలిగించకూడదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ప్రస్తుతం UPI లావాదేవీలపై GST విధించే యోచన లేదన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా తెలుపుడంతో ఆన్‌లైన్ డబ్బుల లావాదేవీలపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనవ్వాల్సిన అవసరం లేదు. అధికారులు సూచిస్తున్నది ఏంటంటే - MSP లాంటి ఏదైనా అదనపు చార్జీలపై మాత్రమే GST వర్తించవచ్చు, కాని సాధారణ UPI లావాదేవీలపై కాదు. ఇక వ్యాపారులు కూడా UPI ద్వారా వచ్చిన డబ్బును తమ లెక్కలలో సరిగ్గా నమోదు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ దూసుకెళ్తోంది
భారతదేశం డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే ముందంజలో ఉంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా జరిగే తక్షణ (రియల్ టైం) లావాదేవీల్లో భారత్ వాటా సుమారు 49 శాతం ఉండటం విశేషం. ఇది ACI Worldwide సంస్థ 2024 రిపోర్ట్ ప్రకారం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో UPI ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం విలువ రూ 21.3 లక్షల కోట్లు కాగా, 2025 మార్చి నాటికి అది రూ 260.56 లక్షల కోట్లు దాటిందని సమాచారం.
అంతేకాదు, వ్యక్తి నుంచి వ్యాపారులకు (పర్సన్ టు మెర్చంట్) జరిగిన లావాదేవీలు కూడా రూ 59.3 లక్షల కోట్లు చేరాయి. ఈ సంఖ్యలు UPI వృద్ధిని, ప్రజలు దీనిని ఎంతగా ఉపయోగిస్తున్నారో చూపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications