Passport Rules: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారు అంటే వారిని ఉన్నతంగా చూసేవారు. కానీ ఇప్పుడు ఇంటికొకరు అక్కడ సెటిల్ అవుతున్నారు. అయితే కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే వారు పాస్ పోర్టు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. తాజాగా పాస్ పోర్టు నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.
అంతర్జాతీయ ప్రయాణాల కోసం కొత్తగా పాస్ పోర్టు అప్లై చేసేవారు ఆగస్టు 5 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు గమనించాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తుదారులు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ ద్వారా www.passportindia.gov.inలో ఆన్‌లైన్ అప్లై చేసేముందు సపోర్ట్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటి ప్రాసెంసింగ్ సమయాన్ని తగ్గించడానికి కేంద్రం కొత్త విధానం తీసుకొచ్చింది.

పాస్ పోర్ట్ పొందేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయడానికి డిజిలాకర్ యాప్ వినియోగించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచించింది. దీన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా అప్‌లోడ్ చేస్తే గనుక వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.
ఆధార్ కార్డు, ప్రస్తుత రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్లు, ఆదాయపు పన్ను రిటర్నులు వంటి వాటిని రెసిడెన్స్ అడ్రస్ ప్రూఫ్ గా ఆమెదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్టడీ, బర్త్ సర్టిఫికెట్స్, పాన్ మరియు ఆధార్ కార్డ్‌లు, పాస్‌పోర్ట్‌లు మరియు ఓటర్ IDలు వంటి కీలక డాక్యుమెంట్స్ సేవ్ చేయడానికి మీరు డిజిలాకర్ ని ఉపయోగించవచ్చు.


Click it and Unblock the Notifications