Ban on OTTs: ఓటీటీలకు కేంద్రం బిగ్‌ షాక్.. ఏకంగా 18 ప్లాట్‌ఫారమ్స్‌పై నిషేధం.. తప్పలేదు మరి!

Bold Content: అడ్డూ, అదుపు లేకుండా చెలరేగిపోతున్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌కు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. ఇష్టారీతిగా వ్యవహరిస్తామంటే కుదరదు అంటూ ముక్కుతాడు వేసింది. కంటెంట్ విషయంలో అలసత్వం వహిస్తే చావు దెబ్బ తప్పదని చేతలతో హెచ్చరించింది. ఈ దెబ్బతో యావత్ మీడియా ఇప్పుడు తమ కంటెంట్ రివ్యూ చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

అభ్యంతరకరమైన కంటెంట్ తో నిండిన పలు ఓటీటీలను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌తో పాటు 19 వెబ్‌సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ పై ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలిపారు. వీటిలోనూ ఒకదానికి కోటి, మరో రెండింటికి అరకోటి వరకు డౌన్‌లోడ్స్ ఉండటం విశేషం.

Centre ban on 18 OTT platforms 19 websites 10 Apps 57 social media handles

మోజ్ ప్లెక్స్, ప్రైమ్ ప్లే, డ్రీమ్ ఫిల్మ్స్, అన్‌కట్‌ అడ్డా, న్యూ ప్లెక్స్ వంటి పలు ఓటీటీలు ఈ లిస్టులో ఉన్నాయి. కాగా ఇప్పుడు నిషేధం విధించిన ఓటీపీలు, వెబ్‌సైట్లు, యాప్ లలో చాలా వరకు బోల్డ్ కంటెంట్, అశ్లీలత ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. స్త్రీలను కించపరుస్తూ, మానవ సంబంధాలను తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు పేర్కొంది.

'టీచర్లు స్టూడెంట్స్ మధ్య చెడు రిలేషన్ షిప్స్, కుటుంబంలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే విధంగా ఆయా ఓటీటీల్లో కంటెంట్ నిండిపోయింది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నాం. మిగతా ప్లేయర్స్ తమ కంటెంట్ లో ఈ తరహా బోల్డ్‌నెస్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మరిన్ని వాటిపై వేటువేసేందుకు వెనకాడబోం' అని సమాచార శాఖ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+