Railway Projects: ఏపీ ప్రజలకు శుభవార్త.. గుమ్మిడిపూండి – గూడూరు 3వ, 4వ రైల్వే లైన్‎కు కేంద్రం ఆమోదం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన దాదాపు రూ. 9,450 కోట్ల మొత్తం వ్యయంతో కూడిన నాలుగు ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఖరగ్‌పూర్ - భద్రక్ (రనితాల్) 4వ లైన్ - 173 కి.మీ.(పశ్చిమ బెంగాల్ ఒడిశా), భద్రక్ - హరిదాస్‌పూర్ 4వ లైన్ - 75 కి.మీ.(ఒడిశా), గుమ్మిడిపూండి - గూడూరు 3వ, 4వ లైన్ - 90 కి.మీ. (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు), కటక్ - పారాదీప్ (బడబంధ) 3వ, 4వ లైన్ - 72 కి.మీ.(ఒడిశా)కు ఆమోదం తెలిపారు. ఈ మార్గాల్లో నాలుగు లైన్లు పూర్తి అయితే.. రవాణాను గణనీయంగా మెరుగుపడనుంది.

సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా బహుళ-రవాణా అనుసంధానాన్ని (మల్టీ-మోడల్ కనెక్టివిటీ), లాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేంద్రం దృష్టి సారించి. ఈ ప్రాజెక్టులను పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఆధారంగా రూపొందించారు. ఈ ప్రాజెక్టులు ప్రజలు, వస్తువులు, సేవల రవాణాకు నిరంతరాయ అనుసంధానం చేయనున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని 8 జిల్లాలలో విస్తరించి ఉన్న ఈ 4 (నాలుగు) ప్రాజెక్టులు, ప్రస్తుతం ఉన్న భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను సుమారు 410 కిలోమీటర్ల మేర పెంచుతాయి. ప్రతిపాదిత మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 6,448 గ్రామాలకు అనుసంధానం కానున్నాయి. ఈ గ్రామాలలో సుమారు 60 లక్షల జనాభా నివసిస్తోంది. వీరికి రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

Railway

ప్రతిపాదిత సామర్థ్య పెంపుదల వల్ల దేశవ్యాప్తంగా కుల్దిహా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, భితర్కనికా జాతీయ పార్క్, మా భద్రకాళి ఆలయం, మా ధమరై ఆలయం, పంచలింగేశ్వర ఆలయం, తల్సరి-ఉదయపూర్, చండీపూర్ బీచ్, పులికాట్ సరస్సు, నెలాపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, గద కుజంగ జగన్నాథ ఆలయం, సరళ ఆలయం, ధబలేశ్వర ఆలయం, లలితగిరి (ఒక బౌద్ధ క్షేత్రం) మొదలైన అనేక ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారికి రైలు ప్రయాణం సులభం కానుంది. ప్రతిపాదిత ప్రాజెక్టులు బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్, ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైల్, ఆహార ధాన్యాలు మొదలైన వస్తువుల రవాణాకు కీలకమైన మార్గాలుగా ఉండనున్నాయి.

ఈ సామర్థ్య పెంపుదల పనుల ఫలితంగా సంవత్సరానికి 76 మిలియన్ టన్నుల (MTPA) అదనపు సరుకు రవాణా జరుగుతుంది. రైల్వేలు పర్యావరణ అనుకూలమైన, శక్తి సామర్థ్యం గల రవాణా విధానం కావడం వల్ల, వాతావరణ లక్ష్యాలను సాధించడంలోనూ, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడంలోనూ సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి చమురు దిగుమతిని (~13 కోట్ల లీటర్లు), CO2 ఉద్గారాలను (~65 కోట్ల కిలోలు) తగ్గించనున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+