Budget News: ఇకపై దేశం దాటాలంటే అది తప్పనిసరి.. బడ్జెట్‌లో కేంద్రం కొత్త ప్రతిపాదన
Foreign Travel: ఈసారి బడ్జెట్‌లో కేంద్రం పలు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. పలు ఆర్థిక అక్రమాలకు చెక్ పెట్టే విధంగా చర్యలు చేపట్టింది. బ్యాంకింగ్ నుంచి విదేశీ ప్రయాణాల వరకు వివిధ రూల్స్ కఠినతరం చేసింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను గురించి క్లియర్ కట్‌గా నిబంధనలు రూపొందించింది. వీటిపై ఓ లుక్కేద్దాం..
భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లడానికి అవసరమైన క్లియరెన్స్ సర్టిఫికేట్‌లను పొందేందుకు నిబంధనలను ఈ బడ్జెట్‌లో కేంద్రం కఠినతరం చేసింది. అక్టోబర్ 1 మొదలు భారతీయవాసులు ఎవరైనా బ్లాక్ మనీ యాక్ట్ కింద క్లియర్‌గా ఉన్నారని ధ్రువీకరణ పొందడం తప్పనిసరి కానుంది. దీనిద్వారా సదరు వ్యక్తులకు పెండింగ్ ట్యాక్సెస్ లేదా బకాయిలు లేవని నిర్ధారణ అవుతుంది.

విదేశీ ఆస్తులు మొత్తం విలువ 20 లక్షల కంటే తక్కువగా ఉంటే, బ్లాక్ మనీ చట్టంలోని సెక్షన్ 42 మరియు 43 కింద 10 లక్షల జరిమానాను తొలగించాలని 2024 బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది. ఇది కూడా అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానుంది. శిక్షాపరమైన నిబంధనల నుంచి ఈ మినహాయింపు.. విదేశీ ఆస్తులను తప్పుగా లేదా రిపోర్టింగ్ చేయనివారికి కూడా వర్తిస్తుందని ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.
సాధారణంగా భారతీయులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు షేర్లు మరియు సెక్యూరిటీల వంటి అన్ని విదేశీ ఆస్తుల లేదా పెట్టుబడులను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. వాటి నుంచి ఏదైనా ఆదాయాన్ని పొందుతుంటే ఆ వివరాలను సైతం వెల్లడించాలి. వాటిని ITRలో పొందుపరచడంలో విఫలమైతే ఆస్తి విలువతో సంబంధం లేకుండా బ్లాక్ మనీ చట్టం ప్రకారం 10 లక్షల జరిమానా విధించవచ్చు. ఇప్పుడు ఈ నిబంధనకు కేంద్రం సవరణలు చేసింది.


Click it and Unblock the Notifications