న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా పద్దెనిమిదో రోజు ఎలాంటి మార్పులేదు. చమురు ధరలు చివరిసారి ఫిబ్రవరి 27వ తేదీన ఈ ధరలు పెరిగాయి. ఆ తర్వాత నుండి ఎలాంటి మార్పులేదు. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17, లీటర్ డీజిల్ రూ.81.47గా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకారం ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.95.57, డీజిల్ రూ.88.60గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు భారీగా ఉండటంతో సామాన్యుడిపై చమురు భారం పడుతోంది. ప్రభుత్వం పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీని రూ.19.9 నుండి రూ.32.98కి పెంచింది. పెంచిన పన్నును ఉపసంహరించుకోనుంది. డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని రూ.15.83 నుండి రూ.31.83కి పెంచారు. అంటే పెట్రోల్ పైన దాదాపు రూ.33, డీజిల్ పైన రూ.32 ప్రభుత్వం పొందుతోంది. కరోనా సమయంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను పెంచాయి.
గతవారం ఏకంగా ఏడాదిన్నర గరిష్టానికి చేరుకొని, 70 డాలర్లను క్రాస్ చేసింది. అయినప్పటికీ దేశీయంగా ధరలు స్థిరంగా ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్‌కు రూ.100 దాటిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.101.84, డీజిల్ రూ.93.77, మధ్యప్రదేశ్‌లోని అనుపూర్‌లో పెట్రోల్ లీటర్ రూ.101.59, డీజిల్ రూ.91.97గా ఉంది.

ఫిబ్రవరి ప్రారంభం నుండి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు ఏడు డాలర్ల వరకు పెరిగాయి. ఈ నెల పదిహేను రోజుల్లో ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) ఢిల్లీలో పెట్రోల్ ధరలు 14సార్లు పెంచగా, రూ.4.22కు పెరిగింది. డీజిల్ ధర రూ.4.34 పెరిగింది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరలు 26 సార్లు పెరిగాయి.
ఈ రెండున్నర నెలల కాలంలో (2021లో) పెట్రోల్ పైన రూ.7.46, డీజిల్ రూ.7.60 పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో భారత్‌లో చమురు డిమాండ్ పైన ప్రభావం చూపుతున్నాయి. చమురు వినియోగం గత ఏడాది సెప్టెంబర్ నుండి దాదాపు ఐదు శాతం మేర క్షీణించింది. డీజిల్ ధరల వినియోగం 8.5 శాతం క్షీణించగా, గ్యాసోలైన్ డిమాండ్ 6.5 శాతం తగ్గింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications