dividend: దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని మోడీ సర్కారు భావిస్తోంది. అందుకోసం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వాటిలో ముఖ్యమైనవి. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థికానికి మూల స్తంభాలని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే, వాటిని బంగారు బాతు అని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డివిడెండ్ రూపంలో ఈ కంపెనీల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంచనాలు మించి ఉన్నాయి.

మరోసారి అంచనాలు మించి:
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సర్కారుకు సమకూరే ఆదాయం మరోసారి రూ.50 వేల కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాదికి గాను రూ.43 వేల కోట్లు పొందవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే ఇంధనం, విద్యుత్, కమొడిటీ విభాగంలో మంచి వృద్ధి నమోదు కావడంతో.. సంబంధిత సంస్థల నుంచి పెద్ద ఎత్తున డివిడెండ్ చెల్లింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

గతేడాది 28 శాతం అధికం:
కోల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC), NHPC, పవర్ గ్రిడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, NMDCల నుంచి.. ఫిబ్రవరి మరియు మార్చిలో భారీగా డివిడెండ్ రాబడి పొందే అవకాశం ఉందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. ఇంధనం, కమొడిటీ ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఆదాయం సాధించాయన్నారు. FY22 ఆర్థిక సంవత్సరంలో CPSEల నుంచి కేంద్రం రూ.59 కోట్ల డివిడెండ్‌లను పొందింది. ముందస్తు అంచనా రూ.46 వేల కోట్ల లక్ష్యం కంటే ఇది 28 శాతం ఎక్కువ కావడం విశేషం.

ONGC, కోల్ ఇండియాల హవా:
దేశీయ క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్నులు ఉన్నా, గత త్రైమాసికంలో ONGC నికర లాభం సంవత్సరానికి 26 శాతం పెరిగింది. తద్వారా ఆదాయం 11 వేల కోట్లను దాటింది. అందువల్ల మార్చి 16 నాటికి ONGC తరఫున అదనపు డివిడెండ్ గా రూ.2,960 కోట్లు ప్రభుత్వానికి చేరనున్నాయి. దీనితో FY23కి గాను సవరించిన అంచనాలు అందుకున్నట్లే. ఇదే ఏడాదిలో ఇప్పటివరకు డివిడెండ్ల రూపంలో మొత్తం ONGC రూ.7,409 కోట్లు చెల్లించింది.
Q3FY23లో కోల్ ఇండియా లాభం 69 శాతం వృద్దిని సాధించి ఏడాదిలో రూ.7,719 కోట్లకు చేరింది. త్వరలోనే రూ.2,240 కోట్ల డివిడెండ్ ను చెల్లించనుంది. FY23లో మొత్తం రూ.7,336 కోట్లు డివిడెండ్ చెల్లింపులు చేసింది. ఇవిగాక NTPC నుంచి సైతం రూ.2,100 కేంద్రానికి రానున్నాయి.

బఫర్ గా పనికొస్తాయి:
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.50 వేల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. FY23లో ఇప్పటివరకు
రూ.31,106 కోట్లు సాధించింది. పూర్తిగా లక్ష్యాన్ని చేరుకోలేని పక్షంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వస్తున్న అధిక డివిడెండ్ లు బఫర్ గా పని చేస్తాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. RBI మిగులు రాబడిలోనూ సుమారు రూ.30 వేల కోట్లు లోటు ఏర్పడింది. దీనితో సవరించిన అంచనాల ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రావాల్సిన డివిడెండ్ ను 45 శాతం తగ్గించి రూ.40,953 కోట్లు మాత్రమే స్వీకరించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications