Housing scheme: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఎర్రకోట నుంచి ఇటీవల ఓ శుభవార్తను అందించారు. పట్టణ ప్రాంతాల్లో గృహ రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ఇది ప్రజలకు చేరువవుతుందని హామీ ఇచ్చారు.
ప్రధాని ప్రకటించిన గృహ రుణ వడ్డీ రాయితీ పథకంపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అప్‌డేట్ ఇచ్చారు. గతంలో రద్దు చేయబడిన PMAY(U) ఉప-పథకం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS) స్థానంలో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. మధ్య ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన పథకం రూపకల్పన ప్రస్తుతం చివరి దశలో ఉందని స్పష్టం చేశారు.

'పథకం రూపొందించడం కోసం చాలా పని జరిగింది. అనేక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలో దీనిపై క్యాబినెట్‌లో చర్చిస్తాం' అని విలేకరుల సమావేశంలో పూరీ తెలిపారు. దేశంలో పట్టణ పాలనకు 2023 ఓ అద్భుత సంవత్సరంగా అభివర్ణించారు. 2014 నుంచి పట్టణాభివృద్ధి కోసం 18.07 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. దీని కింద 1.18 కోట్ల గృహాలు ఆమోదించబడినట్లు చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ మరియు రాజీవ్ ఆవాస్ యోజన ద్వారా దాదాపు మరో తొమ్మిది రెట్లు 13.46 లక్షల గృహాలకు ఆమోదం లభించిందన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications