Elon Musk: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెస్లా కార్లు ఉత్పత్తి ఇండియాలో ప్రారంభం కానందునే వార్తలు హల్చల్ చేశాయి. ఇందుకోసం కేంద్రం కూడా ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెలిశాయి. అయితే ఈ వదంతులపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్‌కి దిమ్మ తిరిగే ఆన్సర్ చెప్పారు.
అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ఆకర్షించే విధంగా భారత్ కొన్ని నిబంధనలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి గోయల్ తెలిపారు. వాటిని టెస్లా వంటి ఓ ఒక్క కంపెనీ కోసమో మార్చలేమని స్పష్టం చేశారు. 40 వేల డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్లపై 70 శాతం కస్టమ్స్ సుంకం రాయితీని టెస్లా కోరుతుంది. ఈ నేపథ్యంలో మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. స్థానిక ఉత్పత్తిని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

దేశంలో శక్తివంతమైన ఎలక్ట్రిక్ వెహికల్ పర్యావరణ వ్యవస్థ అవసరమని ప్రభుత్వం గుర్తించినట్లు వెల్లడించారు. తద్వారా చమురుపై వెచ్చిస్తున్న మొత్తాన్ని ఆదా చేయవచ్చన్నారు. ఈ ప్రయాణంలో ఇతర దేశాల నుంచి EV రంగంలో పెట్టుబడుల కోసం ఆమోదయోధ్యమైన నిబంధనలు రూపొందించినట్లు వివరించారు. ఆయా కంపెనీలు తమ అవసరాలను ప్రతిపాదించవచ్చు కానీ ప్రతిదాన్నీ ప్రభుత్వం నెరవేర్చడం సాధ్యం కాకపోవచ్చన్నారు.
'ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తున్నాము. US, UK, జపాన్, దక్షిణ కొరియా వంటి పలు దేశాలతో ఈ విషయంపై పనిచేస్తున్నాము. EV ప్లేయర్స్‌ను ఆకర్షించేందుకు అధునాతన కెమిస్ట్రీ సెల్స్ తయారీ వైపు అడుగులు వేస్తున్నాం. వీటి ఉత్పత్తిని పెంచేందుకు PLI స్కీమ్స్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది' అని కేంద్ర మంత్రి స్ఫష్టం చేశారు. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం 2030 నాటికి భారతీయ EV మార్కెట్ కోటి యూనిట్లు అమ్మకాలకు పెరిగి ఐదు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications