adani issue: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల అదానీ గ్రూపు కంపెనీలు కోట్లాది రూపాయల మేర నష్టపోయాయి. సంస్థతో పాటు భారత్ పేరు, ప్రఖ్యాతులు సైతం దెబ్బతిన్నాయని దేశంలోని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేస్తున్నారు. ఈ కుంభకోణంపై చర్చ జరిగి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో పార్లమెంటులో గందరగోళ పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రులు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఏమాత్రం వినిపించుకోవడం లేదు.

మార్కెట్ రెగ్యులేటర్లు సిద్ధం:
అదానీ కంపెనీల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మన ఆర్థిక మార్కెట్లు ప్రపంచంలోనే అత్యంక గౌరవనీయమైనవని, అత్యద్భుతంగా నియంత్రించబడేవన్నారు. ఆయా సంస్థల మీద వచ్చిన ఆరోపణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునే సమర్థత వాటికి ఉందన్నారు.

ప్రజాధనం సేఫ్:
దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర జరిగిన నష్టంపై చర్చ నిర్వహించకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అయితే స్టాక్ మార్కెట్ లోని పెట్టుబడులు హెచ్చుతగ్గులకు గురవుతాయని, ఇది సర్వసాధారణమని గోయల్ తెలిపారు. ప్రజాధనానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని, తమ ఖాతాదారుల సొమ్ము పూర్తిగా భద్రమని ఇప్పటికే ఆర్థిక సంస్థలు స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. ఎక్కువగా నష్టపోయాయని ప్రచారం జరుగుతున్న LIC, SBIలు సైతం స్పందించాయన్నారు.

నేను హామీ ఇస్తున్నా..
"ఇది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన విషయమని నేను భావిస్తున్నాను. విదేశీ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక ఆధారంగా ఆరోపణలు వచ్చాయి. మార్కెట్ రెగ్యులేటర్లు తగిన చర్యలు తీసుకుంటారు" అని మంత్రి పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు ప్రపంచంలో ఎవరూ, ఎటువంటి హామీలను ఇవ్వరన్నారు. కానీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిరంతరం పరిస్థితిని గమనిస్తూ ఉంటాయని.. నియంత్రణ సంస్థల సమర్థతపై తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications