టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగులు పెద్ద ఎత్తున తీసుకుంటున్న చర్యలపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. ఉద్యోగుల హక్కుల కోసం పనిచేసే నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) రెండు సార్లు కార్మిక ప్రధాన కమిషనర్‌కు లేఖలు రాసి, విస్తృత స్థాయిలో ఉద్యోగాల తొలగింపులపై వెంటనే జోక్యం చేయాలని విజ్ఞప్తి చేసింది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో, TCS సుమారు 2% ఉద్యోగులను తొలగించనుందని సమాచారం అంటే దాదాపు 12,000 మంది. దీనిపై కంపెనీ CEO కే. కృతివాసన్ మాట్లాడుతూ, "ఇది AI వల్ల వచ్చిన 20% ఉత్పాదకత పెరుగుదల కారణంగా కాదు. ఏరియా స్కిల్ మిస్‌మ్యాచ్ ఉన్న చోట్ల మాత్రమే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం," అని చెప్పారు.
కానీ, ప్రభావితం అయినా ఉద్యోగుల్లో చాలా మంది 10-20 సంవత్సరాలుగా సంస్థలో పని చేసిన మిడ్-లెవెల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులే. వారికి ముందుగా సమాచారం లేకుండా, ఆదివారం సాయంత్రం ఒక్క మెయిల్‌తో ఉద్యోగం తీసేశారన్నది NITES లేఖలో పేర్కొన్న విషయం. ఇది మానవత్వానికి విరుద్ధం, శ్రమ చట్టాల ఉల్లంఘన అని NITES అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో, కేంద్ర కార్మిక శాఖ ఆధీనంలో ఉన్న చీఫ్ లేబర్ కమిషనర్ ఆగస్టు 1న TCS సీనియర్ అధికారులను సమావేశానికి పిలిచారు. ఈ సమావేశంలో సంస్థ తీసుకున్న ఉద్యోగాల తొలగింపు నిర్ణయాలు, కొత్తగా ఎంపికైనవారికి ఆఫర్‌లను ఎందుకు జాప్యం చేస్తున్నారనే అంశాలపై చర్చించనున్నారు.
విభాగాలలో అసమర్థతలు? లేదా వ్యాపార అవసరాల పేరుతో అన్యాయం?
రిపోర్టుల ప్రకారం, చాలామంది ఉద్యోగులను పని ఒత్తిడి పెంచి, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇలా తొలగించడంపై కంపెనీలు నిబంధనలు పాటిస్తున్నాయా? ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇచ్చారా? అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి.
న్యాయ నిపుణులు అస్తా సింగ్ ఇలా అన్నారు "కార్మిక శాఖ సంస్థలు ఉద్యోగులను వయస్సు, లింగం లేదా ఫిర్యాదులు చేసినందుకు టార్గెట్ చేస్తున్నాయా అనే కోణంలో చూస్తుంది. అలాగే, కంపెనీ మరియు ఉద్యోగుల మధ్య సమస్యలు స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు సహాయపడేందుకే ఈ సమావేశాలు జరుగుతాయి.
కానీ, ఉద్యోగుల నియామకం, తొలగింపు వంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం సంస్థలదే అని ఆమె చెప్పారు. ఇవి వారి అంతర్గత విధానాలు, ఉద్యోగ ఒప్పందాలు ఆధారంగా జరుగుతాయి.
భారతదేశంలో ఉద్యోగాలపై కొన్ని ప్రాథమిక కార్మిక చట్టాలు వర్తిస్తాయి. ముఖ్యంగా, ఉద్యోగానికి ముందు నోటీసు ఇవ్వడం, ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు సెవరెన్స్ పే (తగినంత వేతనం లేదా పరిహారం) చెల్లించడం, అక్రమంగా తొలగించిన ఉద్యోగిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం (రీ-ఇన్‌స్టేట్మెంట్) వంటి అంశాలు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ లాంటి చట్టాల ద్వారా పరిపాలించబడతాయి.
కానీ, ఐటీ రంగానికి ఈ చట్టాలు స్పష్టంగా వర్తించవు. ఎందుకంటే ఎక్కువశాతం ఐటీ కంపెనీలు 'సర్వీస్ ఇండస్ట్రీ'గా గుర్తించబడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఐటీ సంస్థలు కార్మిక చట్టాల పరిధిలోకి వస్తాయి. దీంతో, ఐటీ ఉద్యోగులు చట్టపరమైన రక్షణ కొంతమేర పరిమితమవుతుంది. అయినా, ఉద్యోగ ఒప్పందం (Employment Contract) ప్రకారం కంపెనీలు ముందుగానే నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా, అప్రూవ్‌డ్ సెలవులు, వేతనం, తొలగింపులపై సముచిత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రంగంలో ఉద్యోగుల హక్కులపై అవగాహన కల్పించడం ఇప్పుడు అత్యంత అవసరం అయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications