న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టించిన కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులు.. యావత్ దేశాన్నీ అతలాకుతలం చేస్తున్నాయి. తీవ్ర ఆందోళనలోకి నెట్టేశాయి. రోజురోజూకూ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 32,68,710 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. ఇన్ని లక్షల మందికి వైద్య సహాయాన్ని, చికిత్సను అందించడానికి ఆసుప్రతుల్లో ఉన్న సదుపాయాలు చాలట్లేదు. చాలినంత ఆక్సిజన్ అందట్లేదు. అరకొరగా ఉన్న ఆక్సిజన్ నిల్వలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
తక్షణ సాయం కింద..
రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చడానికి, వైరస్ బారిన పడి చికిత్స పొందుతోన్న వారికి అవసరమైన చికిత్సను అందించడానికి, ఆక్సిజన్ నిల్వలను పెంచుకోవడానికి నిధులను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిణామాల మధ్య అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను అధిగమించడానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

రూ.8,873 కోట్లు..
రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ నిధుల (ఎస్డీఆర్ఎఫ్) నుంచి భారీ మొత్తాన్ని విడుదల చేసింది. 8,873 కోట్ల రూపాయల మొత్తాన్ని కొద్దిసేపటి కిందటే మంజూరు చేసింది. ఇది అడ్వాన్స్ మొత్తం. ఈ మొత్తంలో 50 శాతం నిధులను వైద్యపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడానికి ఖర్చు చేసుకోవచ్చని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తంతో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించింది.

ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల బలోపేతానికి..
ఆక్సిజన్ జనరేషన్, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలను భర్తీ చేయడం, వెంటిలేటర్ల కొనుగోలు, అంబులెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచడం, థర్మల్ స్కానర్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లను అందుబాటులోకి తీసుకుని రావడం, ప్రభుత్వ ల్యాబొరేటరీల్లో చాలినన్ని టెస్టింగ్ కిట్లను అమర్చుకోవడం, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింత పెంచేలా చేయడానికి అవసరమైన చర్యల కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది.

జూన్‌కు బదులుగా మేలోనే ఎస్డీఆర్ఎఫ్ నిధులు..
ఎస్డీఆర్ఎఫ్ కింద విడుదల చేయాల్సిన తొలివిడత ఇన్‌స్టాల్‌మెంట్ ప్రతి సంవత్సరం కూడా జూన్‌లో మంజూరు చేస్తుంటుంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని నెల రోజుల ముందే విడుదల చేసింది. యుటలైజేషన్ సర్టిఫికెట్ కోసం ఎదురు చూడకుండానే ఈ మొత్తాన్ని వినియోగించుకునే వెసలుబాటును అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కల్పించిందా మంత్రిత్వ శాఖ.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications