కేంద్ర ప్రభుత్వం బంగారం స్వచ్ఛతలో పారదర్శకతను పెంచే దిశలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 9 క్యారెట్ బంగారానికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. జూలై 2025 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 9 క్యారెట్ల (9K) బంగారాన్ని కూడా హాల్‌మార్కింగ్ కేటగిరీలో తప్పనిసరి చేస్తూ ప్రకటన విడుదల చేసింది. BIS సవరణ నంబర్ 2 ప్రకారం చూసుకున్నట్లయితే ఇది వినియోగదారులకు నమ్మకం కలిగించే ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.
దేశంలో రోజు రొజుకు బంగారం ధర పెరుగుతోంది. జూలై 18, 2025 శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,520కి పెరిగింది. ఈ నేపథ్యంలో బంగారం ప్రియులు ఇప్పుడు తొమ్మిది క్యారెట్ల (9 క్యారెట్ల) బంగారు ఆభరణాలపై మక్కువ పెంచుకుంటున్నారు. 9 క్యారెట్ల ఆభరణాలు 22 క్యారెట్లు లేదా 18 క్యారెట్ల బంగారు ఆభరణాల కంటే చాలా తక్కువ ధరలో ఉంటాయి.ఈ నేపథ్యంలోనే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పుడు 9 క్యారెట్ల బంగారంపై కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది.

హాల్‌మార్కింగ్ అంటే బంగారం స్వచ్ఛతకు హామీ ఇచ్చేది. BIS నిబంధనల ప్రకారం బంగారు ఆభరణాలు, కళాఖండాలపై ఒక గుర్తును వేస్తారు. ఇది బంగారం ఎంత స్వచ్ఛమైనదో చూపిస్తుంది. దీన్నే హాల్‌మార్కింగ్ అంటారు. BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) తాజా ప్రకటన ప్రకారం, హాల్‌మార్కింగ్‌లో ఇప్పుడు 24KF, 24KS, 23K, 22K, 20K, 18K, 14K, 9K గ్రేడ్‌లు ఉంటాయి.
బంగారంలో ప్రతి వేయికి కనీసం 375 భాగాలు ఉండాలి. అంటే 9K బంగారం 37.5% స్వచ్ఛమైనదిగా ఉండాలి. జూలై 2025 నుండి 9 క్యారెట్ బంగారం కూడా హాల్‌మార్కింగ్ పరిధిలోకి రావడంతో జ్యువెలర్స్, వినియోగదారులపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది.ప్రభుత్వ నిర్ణయంతో తక్కువ స్వచ్ఛత గల ఆభరణాల మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. అలాగే డిజైన్, ఎగుమతుల రంగంలో కొత్త అవకాశాలు తెరవవచ్చు.
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ X లో ఒక పోస్ట్‌లో అన్ని ఆభరణాల వ్యాపారులు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు BIS నియమాలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.BIS సవరణ నం. 2 ప్రకారం 9 క్యారెట్ల బంగారం (375 ppt) ఇప్పుడు తప్పనిసరి హాల్‌మార్కింగ్ కిందకు వస్తుంది. అన్ని ఆభరణాల వ్యాపారులు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు దీనిని పాటించాల్సి ఉంటుందని కౌన్సిల్ తెలిపింది.ఇప్పటి వరకు హాల్‌మార్కింగ్ కేటగిరీల్లో 24K, 23K, 22K, 20K, 18K, 14K మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటికి తోడు 9 క్యారెట్ బంగారం (375 ppt) కూడా తప్పనిసరి హాల్‌మార్కింగ్ పరిధిలోకి వచ్చింది. 9కె రాకతో హాల్‌మార్కింగ్ గ్రేడ్‌లు మొత్తం ఎనిమిదికి చేరుకున్నాయి.
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ స్వచ్ఛత గల కానీ డిజైన్‌లో ఆకర్షణీయమైన ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. 9 క్యారెట్ల బంగారం ఎక్కువ డిజైనింగ్ ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.అలాగే ఖరీదైన 22K లేదా 18K ఆభరణాల కంటే వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.9K హాల్‌మార్కింగ్ వినియోగదారులకు సులభమైన ధరలో డైమండ్ మరియు గోల్డ్ జ్యువెలరీ అందించడానికి సహాయపడుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు Senco Gold Ltd మేనేజింగ్ డైరెక్టర్, CEO సువంకర్ సేన్ తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold Silver: ఆ గ్లోబల్ రిపోర్ట్ చెప్పినట్లుగా బంగారం రేటు ఆకాశాన్ని తాకబోతోందా?

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications