DA Hike: ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు మండిపోతున్న ప్రస్తుతం తరుణంలో.. కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని డియర్ నెస్ అలవెన్స్(DA)పై శుభవార్త వినిపించడానికి సిద్ధమవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు 3 శాతం DA పెంపును కేంద్రం వర్తింపచేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదిత పెంపు తర్వాత ప్రస్తుతమున్న 42 శాతం DA కాస్తా 45 శాతానికి చేరుకోనుంది. దసరా, దీపావళి పండుగలకు ముందే ఈ పెంపు గురించి కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది.

ప్రతినెలా లేబర్ బ్యూరో విడుదల వినియోగదారు ధరల సూచిన(CPI-IW) ఆదారంగా కేంద్రం DAను నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్ నెస్ అలవెన్స్ పొందుతున్నారు. కాగా చివరిసారి మార్చి 24, 2023న మోదీ సర్కారు DA ను సవరించింది. ఇదికాస్తా జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది.
'జూన్ 2023కి సంబంధించిన CPI-IW డేటా జూలై 31, 2023న విడుదలైంది. డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపును డిమాండ్ చేస్తున్నాము. కానీ DA పెంపు 3 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం కారణం కాదు' అని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా ఇటీవల తెలిపారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications