న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. ఏ మాత్రం వెనకంజ వేసేలా కనిపించట్లేదు.. రాజీధోరణిని కనపర్చట్లేదు. పైగా ప్రైవేటీకరణ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తోంది.. దూసుకెళ్తోంది. గడువు పెట్టి మరీ వాటిని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు విక్రయించనుంది. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణ వంటి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైనప్పటికీ.. వెనక్కి తగ్గట్లేదు మోడీ సర్కార్. దీనికి సంబంధించిన బిడ్డింగుల ప్రక్రియను క్రమంగా వేగవంతం చేస్తోంది. టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ను తప్పనిసరిగా ప్రైవేటీకరిస్తామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో ఆలోచన ఏదీ లేదని అని కుండబద్దలు కొట్టారు. భారత పరిశ్రమల సమాఖ్య (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ) వార్షిక సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవన్ హన్స్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను కూడా సాధ్యమైనంత వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే విక్రయిస్తామని అన్నారు. పెట్టుబడులను ఉపసంహరించడానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తోన్నామని తెలిపారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవన్ హన్స్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లను విక్రయించడానికి అవసరమైన బిడ్డింగుల ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఆశించిన స్థాయిలోనే ప్రైవేటు సంస్థలు తమ బిడ్లను దాఖలు చేసినట్లు చెప్పారు.

ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో పెట్టుబడుల ఉపసంహరణ పనులను వేగవంతం చేశామని తుహిర్ కాంత్ పాండే పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ఇందులో పెట్టుబడులను ఉపసంహరిచుకుంటోన్నామని తెలిపారు. దీనికోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్ నియామకం ప్రక్రియను చేపట్టామని తెలిపారు. కంటెయినర్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ విషయంలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డింగ్స్ దాఖలు కావాల్సి ఉందని, ల్యాండ్ లీజ్ విధానాలు ఖరారైన వెంటనే దీనిపై ముందుకెళ్తామని అన్నారు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జాతీయ రహదారులకు సంబంధించిన ఆరు లక్షల కోట్ల ఆస్తుల మోనిటైజేషన్ ప్లాన్‌ను రూపొందించాల్సి ఉందని తుహిర్ కాంత్ తెలిపారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కింద దేశంలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను ఆధునికీకరించడానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను చేపట్టామని అన్నారు. ఇదే తరహా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ప్రోగ్రామ్ విమానాశ్రయాల ఆధునికీకరణ విషయంలో విజయవంతమైదని పేర్కొన్నారు.
ఈ సంవత్సరంలోనే ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ల ప్రైవేటీకరణ వందశాతం పూర్తి చేయడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని, ఆర్థిక మంత్రిత్వ శాఖకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తోన్నామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం తీర్మానించిన, ఆమోదించిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ కొనసాగుతుందని తేల్చిచెప్పారు తుహిర్ కాంత్ పాండే. నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తరహాలోనే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ)లో పెట్టుబడులను వందశాతం ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications