Disinvestment: కండోమ్ తయారీ .. కేంద్రం వాటాల విక్రయ ప్రయత్నం.. మ్యాటర్ కోర్టుకు..
Disinvestment: మూడ్స్ కండోమ్‌లను తయారు చేసే హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ కంపెనీలో తమకు ఉన్న మొత్తం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం బిడ్లను కూడా ఆహ్వానించింది. అయితే, ఇప్పుడు ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు పీటీఐ వార్తా సంస్థ నివేధించింది. అదే సమయంలో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరులను కోర్టు సమాధానం కోరింది.

పిటిషన్ దాఖలు..
జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ వీ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మాసనం సబ్‌కా సహయోగ్ సొసైటీ పిటిషన్‌పై కేంద్రంతో పాటు ఇతరుల స్పందనను కోరింది. COVID-19 మహమ్మారి సమయంలో PPE కిట్‌ల సేకరణలో HLL లైఫ్‌కేర్ నోడల్ ఏజెన్సీ అని పిటిషనర్ సమర్పించారు.

అత్యవసర సమయాల్లో..
అత్యవసర సహాయ చర్యల్లో హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ పాత్రను ప్రస్తావిస్తూ.. మహమ్మారిని ఎదుర్కోవటానికి టీకా ప్రచారం ఇంకా కొనసాగుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ క్లిష్ట సమయంలో హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ వంటి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని కోర్టుకు తెలిపారు.

కంపెనీ గురించి..
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అనేది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కండోమ్‌లు కాకుండా.. ఇది గర్భనిరోధక సాధనాలు, మహిళల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ఇతర ఔషధాల తయారీ, పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇది వివిధ వ్యాధుల గుర్తింపు కోసం ఆరోగ్య సంరక్షణ, రోగనిర్ధారణ సేవలతో కూడా అనుసంధానించబడింది.

ప్రభుత్వ లక్ష్యం..
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో మొత్తం వాటాను విక్రయించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ బిడ్‌లను ఆహ్వానించింది. దీనిని సొంతం చేసుకునేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి.


Click it and Unblock the Notifications