కరోనా మహమ్మారి నేపథ్యంలో పెన్షనర్లు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తుది గడువును ఫిబ్రవరి 28వ తేదీగా నిర్ణయించింది. ఈ పొడిగించిన కాలంలో కూడా పెన్షన్ చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతాయి. అంతకుముందు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ తేదీ డిసెంబర్ 31, 2021 వరకు ఉంది. వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కరోనా మహమ్మారి దృష్ట్యా పెద్ద వయస్సు గల పెన్షనర్లు వేగంగా కరోనా బారినపడే అవకాశమున్నందున సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ప్రకారం పెన్షన్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు వ్యవధిని పెంచారు.

లైఫ్ సర్టిఫికెట్
సాధారణంగా ప్రతి పెన్షన్‌దారు పెన్షన్‌ను కొనసాగించేందుకు నవంబర్ నెలలో వార్షిక జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అయితే ఎక్కువ మంది పెన్షనర్లు ఒకేసారి రాకుండా ఉండేందుకు గతంలో ప్రభుత్వం ఎనభై ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వారికి ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుండి కాకుండా అక్టోబర్ 1వ తేదీ నుండి వార్షిక జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించేందుకు అనుమతించింది. లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు పలు మార్గాలు ఉన్నాయి.

వివిధ మార్గాల్లో పద్ధతులు
పెన్షనర్ భౌతికంగా పెన్షన్ డిస్పర్సింగ్ అథారిటీ ముందు హాజరయితే వారి లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంకులు రికార్డ్ చేస్తాయి.
ప్రభుత్వం నియమించిన అధికారి సంతకం చేసిన లైఫ్ సర్టిఫికెట్ ఫామ్ సమర్పిస్తే పెన్షనర్‌కు వ్యక్తిగతంగా ఎవరిముందు హాజరు కానవసరం లేదు.
జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఇంటి నుండి ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చు. యూఐడీఏఐ ఒక వ్యక్తి బయోమెట్రిక్‌ను తీసుకోవడానికి అనుమతించిన అన్ని బయోమెట్రిక్ పరికరాల వివరాలను అందించింది. అలాంటి అన్ని పరికరాల సమాచారాన్ని పొందేందుకు పెన్షనర్లు యూఐడీఏఐ వెబ్ సైట్‌ను సందర్శించాలి.
పోస్ట్‌మ్యాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు పోస్టల్ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు డోర్ స్టెప్ సేవలను ప్రారంభించింది.
ఈజ్ ఆఫ్ బ్యాంకింగ్ సంస్కరణల కింద దేశంలోని వంద ప్రధాన నగరాల్లో ఖాతాదారు పెన్షనర్ల కోసం పన్నెండు బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి.

డోర్ స్టెప్ ఇలా...
లైఫ్ సర్టిఫికెట్ డొర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందడానికి మొదట Doorstep Banking యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
- మీ బ్యాంకును సెలక్ట్ చేసుకోవాలి. లైఫ్ సర్టిఫికెట్ సేవల డోర్ స్టెప్ సర్వీస్ కోసం విజ్ఞప్తి చేయాలి.
- మీ పెన్షన్ అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేసి, ఆ తర్వాత వెరిఫై చేయాలి.
- అక్కడ డోర్ స్టెప్ ఛార్జీలను సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. నామినల్ ఫీజును చెల్లించడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు.
- మీరు విజ్ఞప్తి చేసిన తర్వాత, ఏజెంట్ పేరును పేర్కొంటూ మీకు సందేశం వస్తుంది.
- సదరు బ్యాంకు ఏజెంట్ మీ చిరునామాకు వస్తారు. అక్కడ లైఫ్ సర్టిఫికెట్ సబ్‌మిషన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications