సెక్షన్ 80C లిమిట్ పెంపుపై ఆర్థిక మంత్రి ఫుల్ క్లారిటీ.. పన్ను మినహాయింపులపై కేంద్రం పక్కా ప్లాన్
వేతన జీవులు సంపాదిస్తున్న ఆదాయానికి అనుగుణంగా ఏటా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ పన్నుపోటు నుంచి సెక్షన్ 80C ద్వారా కొంత మేర లబ్ధి పొందేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. అయితే పెరుగుతున్న ఖర్చులు, మెరుగవుతున్న జీవన విధానం వల్ల ఈ మొత్తం ఏ మాత్రం సరిపోదని, ఈ లిమిట్ పెంచాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది.
సెక్షన్ 80C పరిమితిని పెంచాలని ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ నిపుణులు ఎప్పుటినుంచో కోరుతున్నారు. ICAI సైతం తన ప్రీ బడ్జెట్ 2023 సిఫార్సుల్లో సెక్షన్ 80C కింద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)కు సంబంధించిన మినహాయింపును 1.5 నుంచి 3 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే కేంద్రం మాత్రం అందుకు బదులుగా తక్కువ పన్ను రేట్లతో న్యూ ట్యాక్స్ రెజీమ్ ను ప్రవేశపెట్టింది.

అయితే సెక్షన్ 80C లిమిట్ పెంపుపై తాజాగా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. దీనిపై లోక్ సభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మినహాయింపులు మరియు ప్రోత్సాహకాలను తొలగించి, పన్ను రేట్లను తగ్గించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అందువల్ల 80C పరిమితి పెంచే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పారు.
ప్రస్తుతం 80C కింద అనేక ట్యాక్స్ సేవింగ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. హోమ్ లోన్ ప్రిన్సిపల్ పేమెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక ఇన్వెస్ట్ మెంట్స్ కింద చూస్తే PPF, EPF, NSC, NPS, SCSS, పోస్టాఫీస్ మరియు బ్యాంకుల్లో 5 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, ELSS మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ క్లైమ్ చేయొచ్చు.


Click it and Unblock the Notifications