Inflation: నిన్న విడుదలైన గణాంకాల ప్రకారం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెరిగింది. అయితే ఈ క్రమంలో భారతీయ రిజర్వు బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.

పన్ను తగ్గింపులు..
దేశంలో కొన్ని కీలకమైన వస్తువులపై పన్ను తగ్గించాలని సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో ప్రధానంగా ఇంధనం, మెుక్కజొన్న వంటి కొన్ని వస్తువుల జాబితా ఉంది. అయితే వీటిపై టాక్సులను తగ్గించడాన్ని భారత ప్రభుత్వం పరిగణించవచ్చని అంతర్గత సమాచారం ద్వారా వెల్లడైంది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం పెరిగిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవటం జరుగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పెరిగిన ద్రవ్యోల్బణం..
డిసెంబరు నెలలో 5.72 శాతంగా ఉన్నరిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతానికి పెరగటం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాలు, మెుక్కజొన్న, సోయా ఆయిల్ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే మొక్కజొన్న వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం చూస్తోందని సీనియర్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంధనంపై పన్నులను సైతం మళ్లీ తగ్గించవచ్చని వారు తెలిపారు.

తగ్గిన క్రూడ్ ధరలు..
ఇటీవలి నెలల్లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గి స్థిరీకరించబడ్డాయి. అయితే దేశంలోని చమురు కంపెనీలు ఈ తగ్గింపులను వినియోగదారులకు బదిలీ చేయటం లేదు. గతంలో కంపెనీలకు వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రస్తుతం వస్తున్న లాభాలను వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రజలపై ఇంధన ధరల భారం తగ్గటం లేదు. చమురు ధరలు తగ్గుతున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఇంకా ఎక్కువ స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి.

ప్రభుత్వం నిర్ణయం..
ప్రస్తుతం భారత్ తన ఇంధన అవసరాల కోసం మూడింట రెండు వంతులను దిగుమతి చేసుకుంటోంది. అయితే కేంద్రం దీనిపై పన్నులను తగ్గించటం వల్ల పంప్ ఆపరేటర్లు రిటైల్ వినియోగదారులకు ప్రయోజనాలను అందించడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ దిశగా భారతీయ రిజర్వు బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు కూడా చేసిందని వెల్లడైంది.

మళ్లీ రేట్ల పెంపు ఉంటుందా..?
జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగి నిపుణుల అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసేసింది. రానున్న రెండు నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిమితి అయిన 6 శాతం కిందకు రాకుంటే మరింత వడ్డీ రేట్ల పెంపుకు రిజర్వు బ్యాంక్ వెళ్లవచ్చని బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఫెడరల్, స్థానిక ప్రభుత్వాలు ముఖ్యంగా ఇంధనంపై పన్నులను తగ్గించడాన్ని పరిగణించే అవకాశం ఉందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications