ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కోరుకుంటుంటారు. కానీ ఇలాంటి పథకాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, అయితే మీరు చేయవలసిందల్లా మీ కళ్ళు, చెవులతో తెలుసుకుంటూ ఉండాలి. జస్ట్ నామమాత్రపు ఖర్చుతో మీకు రూ. 2 లక్షల కవరేజ్ అందించే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఇలాంటి పథకం గురించి మీరు ఇంతకు ముందు విని ఉండరు.
2015లో ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 9 మే 2015న 'ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన' అనే స్కిం ప్రారంభించారు, ఇది ఒక కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం, ప్రతి ఏడాది రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల పాలసీదారుడు మరణించిన సందర్భంలో ఈ ప్లాన్ నామినీకి ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని అందిస్తుంది.

ఇప్పుడు ఎంతో మందికి లబ్ది
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ పథకంలో చేరే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దేశంలోని 21 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఈ పథకం రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని అందించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా తెలిపింది. 20 అక్టోబర్ 2024 వరకు అందిన మొత్తం క్లెయిమ్‌ల సంఖ్య 860,575, దీని విలువ రూ. 17,211.50 కోట్లు.
మంచి ప్రయోజనం ఉంటుంది
ఈ ప్లాన్ గొప్ప విషయంఏమిటంటే సంవత్సరానికి కేవలం రూ. 436 ప్రీమియంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఈరోజుల్లో బయట ఒక కప్ టీ తాగితే దానికి కూడా కనీసం రూ.10 ఖర్చవుతుంది. అంటే ప్రతి రోజు ఒక కప్పు టీ ఖర్చు సంవత్సరానికి రూ.3650. ఇలా చూస్తే టీ ఖర్చు కంటే తక్కువ ధరకే ప్రభుత్వం మీకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీని కల్పిస్తోంది.
ఎవరు పొందవచ్చు ?
ఈ స్కిం ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చో అంటే బ్యాంకు లేదా పోస్టాఫీసులో అకౌంట్ ఉన్న 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎవరైనా ఈ పథకం కోసం అప్లయ్ చేసుకోవచ్చు. 50 ఏళ్లు పూర్తికాకముందే ఈ ప్లాన్ కింద రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు సాధారణ ప్రీమియం కట్టడం ద్వారా 55 ఏళ్ల వయస్సు వరకు కవరేజీని పొందవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ లేదా అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కోసం అప్లయ్ చేసు చేసుకోవచ్చు. మీకు పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. PMJJBY కింద ప్రతి సంవత్సరం కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుండి ప్రీమియం ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం కావాలంటే, మీరు jansuraksha.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


Click it and Unblock the Notifications