Wheat Flour Exports: మే నెలలో గోధుమ ఎగుమతులను నిషేధించిన తరువాత భారత్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం శనివారం గోధుమ పిండి, మైదా, సెమోలినా, హోల్‌మీల్ ఆటా ఎగుమతులను నిషేధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) దీనికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. కొన్ని సందర్భాల్లో భారత ప్రభుత్వ అనుమతికి లోబడి ఈ వస్తువుల ఎగుమతులు అనుమతించబడతాయని అందులో స్పష్టం చేసింది.

కేబినెట్ నిర్ణయం..
పెరుగుతున్న వస్తువుల ధరలను అరికట్టేందుకు గోధుమ పిండి ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ఆగస్టు 25న ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రష్యా-ఉక్రెయిన్..
రష్యా, ఉక్రెయిన్ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా గోధుమల ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి. ప్రపంచ గోధుమ వ్యాపారంలో నాలుగింట ఒక వంతు వాటా వీటి ఆధీనంలోనే ఉన్నాయి. అయితే.. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రపంచ గోధుమ సరఫరా గొలుసు అంతరాయాలకు దారితీసింది. ఈ క్రమంలో భారతీయ గోధుమలకు డిమాండ్ పెరిగింది. దీంతో అధిక డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్‌లో గోధుమల ధర పెరిగింది.

పెరిగిన భారత ఎగుమతులు..
భారత్ నుంచి గోధుమ పిండి ఎగుమతులు 2022 ఏప్రిల్-జూలై మధ్య కాలంలో.. 2021తో పోల్చితే 200 శాతం వృద్ధి చెందాయి. దీని విలువ 128 మిలియన్ డాలర్లుగా ఉంది. విదేశాల్లో గోధుమ పిండికి పెరిగిన డిమాండ్ దేశీయ మార్కెట్‌లో వస్తువుల ధరలు గణనీయంగా పెరగడానికి దారితీసింది. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిషేధాన్ని ప్రకటించింది.

పెరిగిన రిటైల్ ధరలు..
గత సంవత్సరం ఆగష్టుతో పోల్చితే గోధుమల రిటైల్ ధర 22 శాతం పెరిగి రూ.25.41 నుంచి రూ.31.04కి చేరుకుంది. ఇదే క్రమంలో గోధుమ పిండి ధర 17 శాతం పెరిగి రూ.35.17కి చేరుకుంది. దేశంలో గోధుమ ఉత్పత్తి 3 శాతం తగ్గటం కూడా ఈ రేట్ల ఒత్తిడి వెనుక కారణమని తెలుస్తోంది. ప్రధానంగా పంజాబ్, హర్యామాల్లో వేడిగాలుల కారణంగా ఉత్పత్తి భారీగా తగ్గినట్లు అంచనాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా గోధుమ లభ్యత, ధరల పెరుగుదలపై ఇండస్ట్రీ బాడీ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications