EV: ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలి అనుకుంటున్నారా.. మీకో బ్యాడ్ న్యూస్!!
EV: పెట్రోల్, డీజిల్ వినియోగించే వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్(EV) వాడకాన్ని ప్రోత్సహించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మంచి ప్రణాళికను సైతం రచించింది. ఈ వాహనాల కొనుగోలుపై కొంత మొత్తాన్ని సబ్సిడీ సైతం ఇస్తోంది. ఈ రాయితీపై ఇప్పుడు ప్రభుత్వం ఓ కొత్త నిర్ణయం తీసుకుంది.
దేశంలో EVలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం FAME-II కింద సబ్సీడీ ఇస్తోంది. అయితే జూన్ 1, 2023 తర్వాత రిజిస్టర్ కాబడే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులకు ఓ బ్యాడ్ న్యూస్. ప్రభుత్వం ఇప్పటి వరకు అందిస్తున్న సబ్సిడీలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణం ఇటీవల వెలుగుచూసిన మోసాలేనని భావిస్తున్నార. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజా మార్పుల గురించి తెలియజేసింది.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం kWhకి 10 వేలు ఉంటుంది. వాటి ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం 40 శాతం నుండి 15 శాతం పరిమితి ఉంది. ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు తయారీని పెంచడం కోసం FAME భారతదేశం పథకాన్ని ఏప్రిల్ 1, 2019న భారత్ ప్రారంభించబడింది. మొదటగా దీన్ని మూడేళ్లపాటు కొనసాగించాలని చూసినా, అనంతరం మార్చి 31, 2024 వరకు పొడిగించారు.
FAME పథకం ఫేజ్ II కోసం మొత్తం 10 వేల కోట్లు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ మొత్తంతో EVల కొనుగోలుదారులకు సబ్సిడీ ఇస్తూ.. విస్తృత పాపులారిటీ తీసురావాలని అనుకుంది. ఈ పథకం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (e-3W), ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (e-4W) మరియు ప్రజా, వాణిజ్య రవాణా కోసం వినియోగించే బస్సులకు మాత్రమే వర్తిస్తోంది.


Click it and Unblock the Notifications