Tomato Prices: రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. టమాటా ధరల కట్టడికి కీలక నిర్ణయం..
Tomato Prices: అసలే ఎలక్షన్స్ టైమ్ దగ్గర పడుతోంది. నిత్యావసరాల ధరలు దిగిరాననటంతో ప్రభుత్వాల్లో వణుకు పుడుతోంది. దీంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా రంగంలోకి దిగి ప్రజలకు ఊరట కల్పించే పనిలో పడ్డాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో కూరగాయల ధరలు ఆకాశాన్న తాకాయి. టమాటా, మిర్చి, అల్లంతో పాటు ఇతర కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధరలు కిలో రూ.200కి చేరడంతో వినియోగదారులకు ఊరటను కలిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమోటాలను కొనుగోలు చేయాలని నాఫెడ్, నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌లను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశించింది.

కొనుగోలు చేసిన టమాటాలను నేరుగా ప్రధాన వినియోగదారుల కేంద్రాల్లో తక్కువ ధరలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టమాటాలను ప్రజలకు సబ్సిడీపై కిలో రూ.50కే అందిస్తోంది. టమాటా పండే ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవటంతో ఉత్పత్తి ప్రభావితమైంది. దీంతో టమాటా ధరలు గతంలో ఎన్నడూ చూడని విధంగా పెరిగిపోయాయి.
సాధారణంగా జూన్-జూలైలో టమోటా ధరలు కొంత మేర పెరుగుతుంటాయి. కానీ ఈసారి ద్రవ్యోల్బణం ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. టమోటా ధరలు 445% పెరిగినా రైతులకు పెద్దగా ప్రయోజనం లేదు. నాసిక్ జిల్లా నుంచి కొత్త పంట త్వరలో వచ్చే అవకాశం ఉన్నందున ధరలు తగ్గవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


Click it and Unblock the Notifications