For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST On Rentals: అద్దెపై 18 శాతం GST.. జూలై 18 నుంచి అమలులోకి.. ఎవరికి వర్తిస్తుందంటే..

|

GST On Rentals: జీఎస్టీ అమలు విషయంలో కొత్త రూల్స్ వచ్చేశాయి. దీని ప్రకారం ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 18 నుంచి దేశంలో అమలులోకి వచ్చిన జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం.. GST కింద నమోదైన అద్దెదారు.. రెసిడెన్షియల్ ప్రాపర్టీని అద్దెకు ఇస్తున్నందుకు గాను వచ్చే ఆదాయంపై 18 శాతం వస్తుసేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

GST కింద నమోదైన కంపెనీలు.. కంపెనీ గెస్ట్ హౌస్‌లు లేదా ఉద్యోగుల వసతిని అందించే ఖర్చును పెంచే చర్యలో, GST పాలనలో నివాస యూనిట్లను అద్దెకు ఇవ్వడానికి GST కౌన్సిల్ గతంలో మంజూరు చేసిన మినహాయింపును ప్రస్తుతం తొలగించింది. జూలై 13, 2022న జరిగిన GST కౌన్సిల్ సమావేశం తరువాత ఈ ప్రకటన వెలువడింది. జీఎస్టీ కింద నమోదైన అద్దెదారులు భూస్వామితో సంబంధం లేకుండా 18% GSTని చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

GST (Tax) On Rentals? Registered Tenants To Pay 18% Tax On House Rent

కొత్త నియమం ప్రకారం GST కింద నమోదైన అద్దెదారు రివర్స్ చేంజ్ మెకానిజం కింద అద్దెపై GST చెల్లించాలి. ఆపై చేసిన చెల్లింపుపై ITCని క్లెయిమ్ చేసుకోవాలి. వ్యక్తులకు ఏడాదికి రూ.20 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ, వ్యాపారులకు ఏడాదికి రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అద్దె ఆదాయం ఉన్నట్లయితే వారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని వ్యాపారులకు ఈ లిమిట్ రూ.20 లక్షలుగా ఉంది.

ఈ నిర్ణయం భారతదేశంలోని అద్దె రియల్ ఎస్టేట్ విస్తరణకు ఆటంకం కలిగించవచ్చు. తద్వారా తమ ఉద్యోగులకు గెస్ట్ హౌస్ లు, వసతి గృహాలుగా ఉపయోగించేందుకు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను అద్దెకు ఇచ్చే వ్యాపారాలపై పన్ను భారాన్ని పెంచుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్-రీసెర్చ్ వివేక్ రాఠీ అన్నారు. మరోవైపు దీనివల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఆఫీసు కార్యాలయాలు అద్దె లేదా లీజుకు ఇచ్చిన రిటైల్ స్థలాలు వంటి వాణిజ్య ఆస్తులకు మాత్రమే GST వర్తించేది.

English summary

GST On Rentals: అద్దెపై 18 శాతం GST.. జూలై 18 నుంచి అమలులోకి.. ఎవరికి వర్తిస్తుందంటే.. | central government brought news gst rules on rental income from july 18 know details

GST (Tax) On Rentals? Registered Tenants To Pay 18% Tax On House Rent
Story first published: Friday, August 12, 2022, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X