Crackdown on Loan Apps: దేశంలో ఫేక్ లోన్ యాప్స్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చాలా మంది అమాయకులు వీరి చేతిలో చిక్కి చివరికి వారి ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్న కేసులు నిత్యకృత్యంగా మారాయి. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సైతం దీనిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం చాలా సీరియస్‌గా పరిగణిస్తోంది. అన్‍ఆర్గనైజ్డ్ రుణాలను నిషేధించడంతో పాటు చట్టాలను ఉల్లంఘించిన వారిపై రూ.కోటి జరిమానాతో పాటు 10 ఏళ్లు జైలు శిక్ష విధించే లక్ష్యంతో ఒక చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో క్రమబద్ధీకరించబడని రుణ విధానాల్లో నిమగ్నమైన వివిధ డిజిటల్ లోన్ యాప్‌లపై అణిచివేత, వారి అనైతిక రుణ విధానాలు.. దూకుడు రికవరీ పద్ధతుల గురించి అనేక ఫిర్యాదులు వస్తున్న వేళ కేంద్రం కొత్త చట్టంతో ముందుకొస్తోంది. దీనిపై ఫిబ్రవరి 2025 వరకు ప్రజాభిప్రాయాలను సేకరించటానికి అందుబాటులో ఉంచింది.

బ్యానింగ్ ఆన్ అన్ఆర్గనైజ్డ్ లెండింగ్ యాక్టివిటీస్ పేరుతో చట్టాన్ని తీసుకొస్తోంది. ఆర్థిక సంస్థలు తమ రుణ వ్యాపారాన్ని కొనసాగించటానికి ముందు రిజర్వు బ్యాంక్ లేదా సంబంధిత రెగ్యులేటరీ ఏజెన్సీల నుంచి ముందుగా అనుమతులు పొందాల్సిన అవసరం ఉంది. ముసాయిదా బిల్లు ప్రకారం బంధువులకు రుణాలు ఇవ్వడం మినహా, రుణగ్రహీతల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం క్రమబద్ధీకరించని రుణ కార్యకలాపాలను నిషేధించడానికి ఒక సమగ్ర యంత్రాంగాన్ని అందించడానికి ఒక చట్టం తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. పబ్లిక్ లెండింగ్ యాక్టివిటీ అనేది వ్యక్తులు నిర్వహించే ఫైనాన్సింగ్ వ్యాపారాన్ని సూచిస్తుంది. ఇందులో నగదు లేదా వస్తు రూపంలో వడ్డీ రేట్ల వద్ద బంధువులు కాని వారికి రుణాలు లేదా అడ్వాన్స్‌లు చేయడం వంటివి ఉంటాయని పేర్కొంది. కేవలం బంధువులకు ఇచ్చే రుణాలను మాత్రమే ఈ నిర్వచనం నుంచి మినహాయించింది కేంద్రం. అనధికారికంగా రుణాలు ఇచ్చే విధానాలపై 7 వరకు జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా విధించబడతాయని ముసాయిదా పేర్కొంది. అలాగే రుణాల చెల్లింపుల్లో బలవంతపు వసూళ్లు వంచి పద్ధతులను ఫాలో అయ్యే సంస్థలకు 3 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు కఠినమైన జరిమానాలు ఉంచాయని స్పష్టం చేసింది.
దేశంలో అనధికారిక లోన్ లెడింగ్ యాప్స్ విషయంలో గూగుల్ యాప్ స్టోర్ సైతం సెప్టెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు ఆసక్తికరమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఏకంగా యాప్ స్టోర్ నుంచి 2,200 కంటే ఎక్కువ యాప్స్ ను తొలగించింది. దీనికి ముందు ప్రభుత్వం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు సోషల్ మీడియా కంపెనీలను అటువంటి ఆర్థిక సేవల ప్రకటనలను మానుకోవాలని కోరుతూ మార్గదర్శకాలను జారీ చేసింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications