తెలంగాణలో పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్‌కు చెక్ పెడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో కొత్తగా 14 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 28 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించారు. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ వంటి మహానగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందాలంటే ఇలాంటి పచ్చని వనాలు ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే 'నగర్ వన్ యోజన' పథకం కింద తెలంగాణలోని అటవీ ప్రాంతాలను పర్యాటక, పర్యావరణ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని పార్కులు?
ఈ కొత్త ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్ జిల్లాకు అత్యధికంగా 4 పార్కులు దక్కాయి. మిగిలిన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి..
- • వికారాబాద్: 4 పార్కులు
- • మంచిర్యాల, ఆదిలాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి: ఒక్కో జిల్లాలో 2 చొప్పున పార్కులు.
- • భూపాలపల్లి, కొత్తగూడెం, జగిత్యాల, పెద్దపల్లి: ఒక్కో జిల్లాలో ఒక్కో పార్కు.
ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని మేడ్చల్-మల్కాజిగిరి ప్రాంతంలో వచ్చే పార్కులు నగర ప్రజలకు వీకెండ్ పిక్నిక్ స్పాట్స్ లా మారనున్నాయి.
కేవలం వినోదం మాత్రమే కాదు.. 'గ్రీన్ లంగ్స్'!
సాధారణంగా పార్కులు అంటే కేవలం వాకింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం అనుకుంటాం. కానీ ఈ 'నగర వనాలు' అలా కాదు. వీటిని నగరాలకు 'గ్రీన్ లంగ్స్' గా అధికారులు అభివర్ణిస్తున్నారు. అంటే ఇవి నగర వాతావరణానికి ఊపిరి వంటివి అని అనుకోవచ్చు. వీటివల్ల క్లైమేట్ రెసిలియెన్స్ ఏర్పడుతుంది. పెరుగుతున్న ఎండ తీవ్రతను తగ్గించడానికి ఇవి దోహదపడతాయి. అలాగే జీవవైవిధ్యం పెరుగుతుంది. స్థానిక మొక్కలు, పక్షులు, జంతుజాలానికి ఇవి రక్షణగా నిలుస్తాయి.
ఈ అర్బన్ ఫారెస్ట్ లలో మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నారు. ప్రతి పార్కుకు 2 కోట్ల రూపాయల నిధులతో మెరుగైన ప్రహరీ గోడలు, వాకింగ్ పాత్ లు, పర్యాటకులకు అవసరమైన కనీస వసతులు కల్పిస్తారు.
హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న పచ్చదనం
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 'హరితహారం' ద్వారా పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. దానికి తోడు కేంద్రం ఇచ్చే ఈ 14 పార్కులు తోడైతే, తెలంగాణ పర్యావరణ రంగంలో మరో అడుగు ముందుకు వేసినట్లవుతుంది. హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే గజ్జల గూడ, నారపల్లి వంటి చోట్ల ఉన్న అర్బన్ పార్కులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అదే స్ఫూర్తితో కొత్తగా రాబోయే పార్కులను కూడా పర్యావరణానికి విఘాతం కలగకుండా అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు.
త్వరలోనే ఈ పార్కులకు సంబంధించిన భూమి చదును చేయడం, ఫెన్సింగ్ వేయడం వంటి పనులు మొదలుకానున్నాయి. మొత్తంగా ఈ పచ్చని అడవులు అందుబాటులోకి వస్తే.. ఆ ప్రయోజనాన్ని తర్వాతి తరం వాళ్లు మెరుగ్గా పొందే అవకాశం ఉంటుంది. అంటే మన పిల్లలకు ప్రకృతి ఒడిలో ఆడుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుందన్న మాట.
More From GoodReturns

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications