కొత్త రూ.75 నాణెం విడుదలకు కేంద్రం నోటిఫికేషన్.. కానీ సాధారణ చెలామణికి నో ఛాన్స్..

75 Coin: దేశంలో జరిగిన ప్రముఖ సంఘటన, వ్యక్తులు, చారిత్రక ఘట్టం సందర్భంగా వివిధ రకాల నాణేలను కేంద్రం విడుదల చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా రూ.10, అటల్ బిహారీ వాజ్‌ పేయి స్మారకంగా రూ.100, NTR శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూ.100 వంటి నాణేలను ఇటీవల లాంచ్ చేసింది. తాజాగా ఈసారి రూ.75 రూపాయల కాయిన్ విడుదలకు రంగం సిద్ధమైంది.

భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా మోదీ ప్రభుత్వం రూ.75 నాణెం విడుదల చేయనుంది. ఈ మేరకు మే 25న ప్రభుత్వం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అధికారం కింద రూ.75 నాణెం తయారు చేయబడుతుంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన గెజిట్‌లో పేర్కొంది. కాగా మే 28న కొత్త భవనాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.

Central gazette notification for 75 coin release in the memory of new parliament house

ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకోవడానికి గుర్తుగా విభిన్న డిజైన్‌ తో నూతన నాణెం విడుదల కానుంది. కొత్త రూ.75 నాణెం 35 గ్రాముల బరువుతో వృత్తాకారంలో ఉంటుంది. 44 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ లో తెలిపింది. 35 గ్రాముల నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్ మరియు 5 శాతం జింక్‌ తో కూడిన నాలుగు లోహాల మిశ్రమంతో రూ.75 నాణెం తయారు చేయబడుతుందని వెల్లడించింది.

నాణానికి ముందు భాగంలో అశోక స్థంభం, మూడు సింహాలతో కూడిన రాజముద్ర.. దాని క్రింద దేవనాగరి లిపిలో 'సత్యమేవ్ జయతే' అని వ్రాయబడి ఉంటుంది. ఇక ఎడమ వైపున 'భారత్' అని అదే లిపిలో, కుడి వైపున ఇండియా అని ఇంగ్లీషులో ఉండేలా డిజైన్ చేసినట్లు వెల్లడించింది. ఇక వెనుక వైపున పార్లమెంటు కాంప్లెక్స్ చిత్రం, ఎగువ అంచున దేవనాగరి లిపిలో "సంసద్ సంకుల్" మరియు దిగువ అంచున ఆంగ్లంలో "పార్లమెంట్ కాంప్లెక్స్" అని శాసనం ఉంటుందని పేర్కొంది. కాంప్లెక్స్ చిత్రం క్రింద అంకెలలో 2023 సంవత్సరం వ్రాయబడుతుందని స్పష్టం చేసింది.

అయితే రూ.75 నాణెం విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) 75వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 2020లో దీనిని ప్రభుత్వం ప్రారంభించబడింది. అయితే ప్రత్యేక సంఘటనల జ్ఞాపకార్థం తయారుచేసిన నాణేలు సాధారణ చెలామణిలోకి విడుదల చేయబడవని గమనించాలి. ఈ తరహా స్మారక నాణేలను సేకరించాలనుకుంటే నిర్ధిష్ట ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+