GST: జీఎస్టీ బేస్ పెంచేందుకు కేంద్రం పెద్ద కసరత్తే చేస్తోంది. ఇందుకోసం కరెంటు బిల్లులు, ఆస్తిపన్ను డేటాను వినియోగించుకోవాలని చూస్తోంది. జీఎస్టీ కింద మరింత ఆదాయాన్ని సేకరించటంలో భాగంగా జీఎస్టీకి సంబంధించి బోర్డు ఈ వ్యూహాన్ని తెరమీదకు తెచ్చింది.

జీఎస్టీ ఆరంభంలో..
దేశంలో జీఎస్టీని తొలుత అమలులోకి తెచ్చినప్పుడు రూ.45-50 లక్షల జీఎస్టీ పన్ను బేస్ ఉండేదని CBIC చైర్మన్ వివేక్ జోహ్రి తెలిపారు. అయితే ఇప్పుడు దానిని రూ.1.4 కోట్లకు పెంచినట్లు ఆయన వెల్లడించారు.కానీ ప్రస్తుత సమయంలో పన్ను బేస్ మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రిక్ మీటర్ల డేటా..
జీఎస్టీ బేస్ పెంపుకు తాము క్రమంగా శాస్త్రీయ పద్ధతిలో ముందుకెలతామని జోహ్రీ వెల్లడించారు. దీనికోసం దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఎలక్ట్రిక్ మీటర్ల డేటాను సేకరిస్తామని తెలిపారు. అలాగే ఆస్తి పన్ను డేటాను కూడా ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. పన్ను ఆదాయాన్ని పెంచటమే లక్ష్యంగా జీఎస్టీ బోర్డు ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. సేకరించిన సమాచారాన్ని డేటా అనలటిక్స్ ద్వారా జల్లెడపడతామని స్పష్టం చేశారు.

తక్కువగా టాక్స్ పేయర్స్..
తమ పరిశీలన ప్రకారం జీఎస్టీ చెల్లించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని జోహ్రీ తెలిపారు. ఇటీవల కేంద్రం బడ్జెట్ 2023 సమావేశాల్లో పాన్ కార్డును దేశంలో ఉమ్మడి వ్యాపార ఐడెంటిటీగా ప్రకటించినందున ఆ డేటాను తాము జీఎస్టీ వసూళ్ల పెంపుకు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా పన్ను చెల్లించదగిన వారిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.

బిల్లింగ్ లేకుండా వ్యాపారం..
ప్రస్తుతం దేశంలో వ్యాపారులు కస్టమర్లకు బిల్ ఇవ్వకుండానే వస్తువులను, ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అయితే రోజువారీ లక్షల్లో వ్యాపారాలు నిర్వహించే ఇలాంటి వారు బిల్స్ లేకుండా వ్యాపారాలను కొనసాగించటం వల్ల జీఎస్టీ పరిధి నుంచి తప్పించుకుంటున్నారని.. ఈ సమస్యకు సైతం త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటామని ఆయన వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లలో ఇలాంటి నష్టాలను అధిగమించటానికి పరిష్కారాలతో వస్తామన్నారు. ఇలాంటి వాటి నుంచి టాక్స్ చెల్లింపుదారులను, వినియోగదారులను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, టాక్స్ డిపార్ట్ మెంట్ ప్రకటనలు కూడా ఇస్తోందని అన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications