సామాన్యులకు దొరకడం కష్టమే ఇక.. బంగారాన్ని టన్నుల కొద్దీ దాచుకుంటున్న కేంద్ర బ్యాంకులు..

బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు.. దీంతో పసిడిపై కేంద్ర బ్యాంకులు అలర్ట్ అవుతున్నాయి. వ్యూహాత్మకంగా పసిడి కొనుగోళ్లు సాగిస్తున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నపసిడి కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న బులియన్ ధరలు కలయికతో భారతదేశపు అధికారిక Gold నిల్వల విలువ రికార్డు స్థాయిలో 115.8 బిలియన్ డాలర్లకు చేరింది.

గడిచిన గత రెండేళ్ల కాలంలోనే ఈ Gold నిల్వల విలువ దాదాపు రెట్టింపు కావడం విశేషం. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. పాశ్చాత్య దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో, సాంప్రదాయ విదేశీ కరెన్సీ నిల్వల (ముఖ్యంగా అమెరికన్ డాలర్) భద్రతపై పలు దేశాల కేంద్ర బ్యాంకుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ విచ్ఛిన్నమైన భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు తమ రిజర్వ్ నిర్వహణ వ్యూహాలను పునఃసమీక్షించుకుని.. అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపాయి.

central banks gold reserves gold buying gold demand geopolitical risks global economy reserve strategy central bank gold bullion safe haven precious metals World Gold Council inflation US dollar de-dollarization gold market global finance investment gold prices financial markets -

సంప్రదాయ విదేశీ కరెన్సీలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ.. రిజర్వ్ ఆస్తులను వైవిధ్యపరచాలనే భారత్ వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల గత ఆరు నెలల కాలంలో భారతదేశ మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 17 శాతానికి పెరిగింది. అయితే ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ వాటా కేవలం 12 శాతంగా మాత్రమే ఉండేది. భారతదేశ బంగారు నిల్వల విలువ ఈ స్థాయిలో పెరగడానికి ఆర్‌బీఐ కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అసాధారణంగా పెరగడం కూడా ప్రధాన కారణమైంది.

Also Read

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 2024 ప్రారంభంలో ఒక ఔన్సుకు సుమారు 2 వేల డాలర్లుగా ఉండగా.. ప్రపంచవ్యాప్త డిమాండ్ కారణంగా 2026 నాటికి అది ఏకంగా ఔన్సుకు 4 వేల డాలర్ల పైకి చేరింది. ఈ అసాధారణ ధరల పెరుగుదల వల్ల ఆర్‌బీఐ వద్ద ఉన్న నిల్వల డాలర్ విలువ గణనీయంగా పెరిగింది. ఈ విధంగా డాలర్ వంటి కరెన్సీల హెచ్చుతగ్గుల నుండి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి గ్లోబల్ సంక్షోభాల సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న ఈ బంగారం వైవిధ్యీకరణ వ్యూహం భారతదేశానికి ఒక బలమైన రక్షణ కవచంగా మారుతోంది. ఈ వ్యూహాత్మక మార్పులో భారతదేశం ఏకాకి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకులు కూడా ప్రస్తుతం ఇదే బాటలో పయనిస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+