Gold News: గోల్డ్ రేట్లు పెరగటానికి RBI కారణం..! సెంట్రల్ బ్యాంక్స్ క్రేజీ షాపింగ్..

Gold Accumulation: ఏడాది కిందటి కంటే పసిడి ధరలు ప్రస్తుతం దాదాపు 15 శాతం పెరుగుదలతో కొనసాగుతున్నాయి. అలాగే గడచిన 5 నెలల కాలంలో దేశీయ బంగారం ధరలు 10 గ్రాములకు రూ.60,000 స్థాయిల నుండి రూ.71,132కి పెరిగాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 12న రికార్డు గరిష్ట స్థాయి రూ.73,958ను తాకింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.72,000లకు పైనే కొనసాగుతోంది.

దేశంలో పసిడి ధరలు అనూహ్యంగా పెరుగుదల ప్రపంచ అనిశ్చితిని సూచిస్తుంది. ప్రపంచ సూపర్ పవర్ దేశాల మధ్య ఆర్థిక వైరుధ్యాలు, అధిక వడ్డీ రేట్లు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధాలు వంటి కారణాలు ఆర్థిక అనిశ్చితులను సృష్టించాయి. ద్రవ్యోల్బణం, ప్రభుత్వాల విధానాలకు లోనయ్యే ఫియట్ కరెన్సీల మాదిరిగా కాకుండా పసిడి విలువను కలిగి ఉంటుంది. అందుకే దశాబ్దాలుగా ఇది అనిశ్చితి కాలంలో నమ్మదగిన పెట్టుబడిగా పరిగణించబడుతోంది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో ఈక్విటీ మార్కెట్ విలువలు పెరగడం పరోక్షంగా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైయర్‌గా బంగారం డిమాండ్‌ను పెంచుతుంది.

Central banks across globe gold aquisition lead to rising prices RBI too shopped

వాస్తవానికి పసిడి ధరలు ఊపందుకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు, రిటైల్ - సంస్థగాత ఇన్వెస్టర్ల పెట్టుబడులు రేట్ల పెరుగుదలను ప్రేరేపిస్తున్నాయి. అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఈ ఏడాద వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉన్నందున సంస్థాగత పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. ఇక్కడ గమనిస్తే.. సెంట్రల్ బ్యాంకర్లు తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను వైవిధ్యపరచడానికి, యూఎస్ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి గణనీయమైన మొత్తంలో బంగారాన్ని చురుగ్గా కూడబెట్టుకుంటున్నారు. ఇవి ధరలను అపూర్వమైన స్థాయికి పెంచుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డాలర్ డిపెండెన్సీ నుంచి సెంట్రల్ బ్యాంకులు దూరంగా జరుగుతున్నాయి. దీంతో అవి ఆర్థిక స్థిరత్వం కోసం భారీగా బంగారాన్ని కొంటున్నాయి. ఇది ఆర్థిక సంక్షోభాల సమయంలో ఆర్థిక వ్యవస్థలను స్థిరీకరించడానికి ఒక రక్షణను అందిస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభ సమయంలో బంగారం విలువైన ఆస్థిగా 1997-98 ఆసియా సంక్షోభ కాలంలో పనిచేసింది. అలాగే వాస్తవానికి 2022 నుంచి సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. రష్యాపై అమెరికా ఆంక్షలతో సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కూడబెట్టుకోవటాన్ని వేగవంతం చాశాయి. చెల్లింపులకు దీనిని వారు వినియోగించాలని భావించారు.

దీని తర్వాత పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 17 నెలల నుంచి బంగారాన్ని విపరీతంగా కొంటోందని వెల్లడైంది. కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు, డాలర్ కి దూరంగా జరిగేందుకు గోల్డ్ గేమ్ ఆడుతోంది చైనా. చైనాతో పాటు ఇతర దేశాలు సైతం తమ ఫారెక్స్ నిల్వల్లో అమెరికా డాలర్ ను తగ్గిస్తున్నాయని వెల్లడైంది. 2022లో చైనా సెంట్రల్ బ్యాంక్ 62.1 టన్నుల బంగారం కొనగా.. 2023లో ఏకంగా 224.88 టన్నులను కొనుగోలు చేసింది. నవంబర్ 2022 నుంచి చైనా పసిడి నిల్వలు 314 టన్నులు పెరిగాయని డేటా వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ బంగారం గనున్నో ఉన్నప్పటికీ చైనా బయటి నుంచే పసిడిని కొనుగోలు చేస్తోంది. చైనా రియల్టీ పతనంలో చాలా మంది ప్రజలు గోల్డ్ కొంటున్నారు.

ఇక భారత్ సైతం తన పసిడి నిల్వలను భారీగానే పెంచుకుంటోంది. అలాగే పోలాండ్, సింగపూర్, చెక్ రిపబ్లిక్, లిబియా సంయుక్తంగా 2023లో 260 టన్నుల బంగారాన్ని కొన్నాయి. ఇక టర్కీ 2022లో 147.60 టన్నులు పసిడి కొనగా.. 2023లో 30.12 టన్నులు కొనుగోలు చేసింది. 2024 మెుదటి మూడు నెలల కాలంలో ఇండియా 19 టన్నులు బంగారాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది 16 టన్నులు అంతకు ముందు ఏడాది 34 టన్నులు కొనుగోలు చేసింది. దీంతో 2009 తర్వాత అత్యధికంగా 77 టన్నుల పసిడిని రిజర్వు బ్యాంక్ కొనుగోలు చేసింది.

అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల విషయానికొస్తే అమెరికా 8,133 టన్నులతో ముందంజలో ఉంది. జర్మనీ 3,366.49, ఇటలీ 2,451.84, ఫ్రాన్స్ 2,436.01, రష్యన్ ఫెడరేషన్ 2,271.16 టన్నుల బంగారం కలిగి ఉన్నాయి. ఇండియా నిల్వల విషయంలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+