RBI Rate Hike: భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఏప్రిల్ సమావేశాల్లో వడ్డీ రేట్ల పెంపు పాస్ చేసినట్లు వెల్లడించింది. అయితే చాలా మంది ఈ క్రమంలో 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంపును అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సైతం రేట్ల పెంపుకు బ్రేకులు వేయాలని యోచిస్తున్నాయి.
indiacharts.com వ్యవస్థాపకుడు శ్రీవాస్తవ అంచనాల ప్రకారం రిజర్వు బ్యాంక్ దేశంలో వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే దీర్ఘకాలం కొనసాగించవచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పూర్తిగా తగ్గలేదని.. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు రేట్ల పెంపును ఇప్పటికే నిలిపివేశాయి.

US బ్యాంకింగ్ సంక్షోభం భయాలు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు తాకుతాయనే ఆందోళనల నేపథ్యంలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఏప్రిల్ 6న నిర్వహించిన ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచాలని RBI నిర్ణయించింది. ఏప్రిల్ 4న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా (RBA) వడ్డీ రేటును 3.6 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 5న, పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత వడ్డీ రేట్లను 6.75 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది.

ఆర్‌బీఐ పాలసీ ప్రకటనపై భారతీయ బాండ్ ఈల్డ్ మార్కెట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ మునుపటి ముగింపు 7.267 శాతం నుంచి 6 bps తగ్గి 7.204 శాతానికి చేరుకుంది. 5 సంవత్సరాల బాండ్ ఈల్డ్ మునుపటి ముగింపు 7.142 శాతం నుంచి 13 bps తగ్గి 7.008 శాతం వద్దకు చేరుకుంది. అయితే ఒక సంవత్సరం బాండ్ ఈల్డ్ 23 బేసిస్ పాయింట్లు కోల్పోయి 6.896 శాతం వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications