అంతర్జాతీయ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. విమానాశ్రయాల్లో బయోమెట్రిక్ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రభుత్వం డిజిటలైజ్ చేస్తున్నట్లు అసోచామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

త్వరలోనే అందుబాటులోకి..
గత నెలలో ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణీకుల రద్దీ భారీగా నమోదైనట్లు సింధియా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణీకుల ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ను ప్రస్తుతం బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులే మాన్యువల్‌గా చేస్తున్నారన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో కలిసి సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

డేటా బ్యాంక్ అవసరం:
మన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ సహా ఇతర వివరాలపై ఓ డేటా బ్యాంక్ లేదా రిపోజిటరీని తయారు చేయాల్సిన అవసరం ఉందని విమానయాన శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. తద్వారా పలు విషయాలను పరిగణలోనికి తీసుకుని ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.త్వరలోనే ఈ సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications