PSBs Privatization: ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి BJP అధికారంలోకి వచ్చింది. కాగా దీనిపై వెనక్కి తగ్గవచ్చినే విశ్లేషణలు ఉన్నాయి. ఈ విషయంపై RBI మాజీ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో 2024-25లో కొంత పురోగతిని సాధించవచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. 'గత కొన్నేళ్లుగా IDBI బ్యాంక్ వాటాల విక్రయం జరగడం చూశాం. ఈ ఏడాది ఇతర బ్యాంకుల ప్రైవేటీకరణ కూడా జరగవచ్చు. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు ముందుకు సాగుతుందని భావిస్తున్నాం' అని RBI మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ సిన్హా తెలిపారు.

ప్రైవేటీకరణ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతుండగా, ప్రభుత్వం దీని గురించి పునరాలోచించవచ్చని PSBలకు సంబంధించిన ఓ ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఎన్నికల కారణంగా ప్రక్రియ నిలిచిపోయిందని, త్వరలోనే తిరిగి వాటిపై దృష్టి సారిస్తుందని వెల్లడించారు.
2022లో బడ్జెట్ సమర్పణ సమయంలో 1.75 లక్షల కోట్లను సమీకరించేందుకు పెట్టబడుల ఉపసంహరణ డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాగా గత నెలలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇదే విషయంపై కీలక కామెంట్స్ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications